Home Loans: క్రెడిట్‌ స్కోరు ఆధారంగా హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లు

దాదాపుగా అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్న రుణగ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలందజేస్తాయి. వివిధ బ్యాంకుల్లో క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Updated : 17 Oct 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటి కొనుగోలు ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల చాలామంది బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటారు. బ్యాంకులు కూడా అందరికీ ఒకే వడ్డీ రేటుతో రుణాలివ్వవు. రుణం తీసుకునేవారి ఆదాయం, వయసు, వృత్తి, ముఖ్యంగా క్రెడిట్‌ స్కోరు.. వంటి విషయాల్లో సానుకూలతలు చూస్తాయి. క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి చాలా రకాల రుణాలు వేగంగా, సరసమైన వడ్డీ రేట్లకు లభిస్తాయి. అదేవిధంగా ఇంటి రుణాలపై కూడా క్రెడిట్‌ స్కోరును బట్టి బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంటాయి.

క్రెడిట్‌ స్కోరు ఆధారంగా బ్యాంకుల ఇంటి రుణాల వడ్డీ రేట్లను దిగువ పట్టికలో చూడండి..

గమనిక: ఈ డేటా 2023, అక్టోబరు 12 నాటిది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వారి వెబ్‌సైట్‌లో క్రెడిట్‌ స్కోరుతో లింక్‌ చేసిన గృహ రుణ వడ్డీ రేట్ల ప్రకారం ఈ డేటాను తెలియజేశాం. వడ్డీ రేటు సూచిక, వాస్తవ పరిస్థితిలో వివిధ కారకాలు, బ్యాంకుకు సంబంధించిన నియమ, నిబంధనలను బట్టి వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని