Honor 90 5G: 200 ఎంపీ కెమెరాతో హానర్‌ 90 5జీ... ధర కొంచెం ఎక్కువే..!

Honor 90 5G launched: హానర్‌ 90 5జీ మోడల్‌తో భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. 200 ఎంపీ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌ ధరను కంపెనీ రూ.37వేలుగా నిర్ణయించింది.

Updated : 14 Sep 2023 15:54 IST

Honor 90 5G Details | ఇంటర్నెట్‌ డెస్క్‌: హానర్‌ మొబైల్‌ బ్రాండ్‌ భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. హానర్‌ 90 5జీ (Honor 90 5G) పేరిట దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (సెప్టెంబర్‌ 14) భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. 200 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తుండడం దీని ప్రత్యేకత. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అప్‌డేట్స్‌, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ పేర్కొంది. ఇంతకీ హానర్‌ తీసుకొచ్చిన కొత్త ఫోన్‌ ఫీచర్లు ఏంటి? ధరెంత?

హానర్‌ 90 5జీ (Honor 90 5G) స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.37,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 512 జీబీ వేరియంట్‌ ధర రూ.39,999గా పేర్కొంది. సెప్టెంబర్‌ 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి హానర్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌లో ఎక్స్ఛేంజీపై ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డు హోల్డర్లు రూ.3వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. డైమండ్‌ సిల్వర్‌, ఎమరాల్డ్‌ గ్రీన్‌ మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

బ్యాంకు ఖాతాలో డబ్బులేవా..? అయినా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు

హానర్‌ 90 5జీ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 1.5కె స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఈ స్క్రీన్‌ వస్తోంది. 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 7.1తో వస్తోంది. ఇందులో 200 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్‌ ఇస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీ పంచ్‌ హోల్‌ కెమెరా అమర్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్‌ వస్తోంది. ఎన్‌ఎఫ్‌సీ, టైప్‌-సి కనెక్టివిటీ, బ్లూటూత్‌ 5.2తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని