Bank Accounts: బ్యాంకు ఖాతాలు ఎక్కువ ఉంటే ఇబ్బందులుంటాయా?
ఈ రోజుల్లో వివిధ బ్యాంకుల్లో బహుళ ఖాతాలను వినియోగదారులు కలిగి ఉంటున్నారు. ఎక్కువ ఖాతాలను తెరవడానికి కారణాలు ఏంటి, ఈ ఖాతాలతో లాభ, నష్టాలుంటాయా అనేది ఇక్కడ చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: యుక్త వయసు నిండిన వారందరికీ బ్యాంకు ఖాతా ఉండడం నేడు సర్వ సాధారణమైపోయింది. బ్యాంకు ఖాతాతో అనేక ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఒకప్పుడు పెద్దవారే బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, రుణాలు తీసుకోవడం లాంటివి చేసేవారు. ఇప్పుడు యుక్తవయసు వారు విద్యా రుణాలు తీసుకోవడం, చిన్న పిల్లల డిపాజిట్లను బ్యాంకులు ప్రొత్సహించడం లాంటివి చేస్తున్నాయి. దీంతో అన్ని వయసులవారికీ బ్యాంకు ఖాతాలు అవసరమయ్యాయి. కానీ కొంత మందికి ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు కూడా ఉంటున్నాయి. ఎక్కువ ఖాతాలు అవసరం ఎంత ఉంటుంది? వీటి వల్ల లాభాలు, నష్టాలు ఏమయినా ఉంటాయా? అనేది ఇప్పుడు చూద్దాం..
ఎక్కువ ఖాతాల అవసరం ఎందుకు?
ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా బ్యాంకు ఖాతాలోనే జీతం పడడం ఈ రోజుల్లో సాధారణమైన విషయం. చాలా మంది తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త ఖాతాలు పుట్టుకొస్తుంటాయి. ప్రతి యజమానీ వారి జీతం ఖాతాలను సంస్థతో టైఅప్ బ్యాంకులో ఓపెన్ చేయిస్తారు. అంతేకాకుండా వినియోగదారులు వ్యాపారం, పెట్టుబడులు మొదలైన వాటి కోసం అదనపు ఖాతాలు కలిగి ఉంటారు. ఇలాంటప్పుడు పాత ఖాతాలు అలా ఉండిపోతూ ఉంటాయి.
సౌకర్యాన్ని బట్టి ఖాతా
డెబిట్ కార్డులు, రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లాకర్ వంటి అవసరాలు ప్రజలకు ఎప్పుడూ ఉంటాయి. వినియోగదారులకు అందించే సౌకర్యాలు కూడా బ్యాంకును బట్టి మారొచ్చు. ఖాతా ఉన్న బ్యాంకులో వినియోగదారుడి అవసరాలు తీరకపోవచ్చు. ఉదాహరణకు బ్యాంకు లాకర్ అవసరం పడినప్పుడు ఖాతా ఉన్న బ్యాంకులో లాకర్ దొరక్కపోవచ్చు. లేదా సరైన సైజ్ లాకర్ లభించకపోవచ్చు. లాకర్ ఛార్జీలు, డిపాజిట్లు వంటి అంశాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారుడు వేరే బ్యాంకును ఆశ్రయించి కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇటువంటి అనేక అవసరాల వల్ల కూడా బ్యాంకు ఖాతాలు పెరిగిపోతుంటాయి.
ఖాతాలు ఎక్కువైతే ఇబ్బందులు
దాదాపు అన్ని పొదుపు ఖాతాలకు కనీస నగదు నిల్వను నిర్వహించాలి. ఇది సరిగ్గా నిర్వహించలేకపోతే బ్యాంకులు ఖాతాదారులపై నాన్-మెయింటెనెన్స్ ఛార్జీలు విధిస్తాయి. మీరు 1 లేదా 2 బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే.. కనీస నగదు నిల్వను సులభంగా నిర్వహించొచ్చు. ఎక్కువ ఖాతాలు ఉంటే.. ప్రతి ఖాతాలో నిల్వను నిర్వహించడం కష్టమే అవుతుంది. ఇది ఆర్థికంగా కూడా ఇబ్బందే. ఎందుకంటే కొన్ని బ్యాంకులు కనీస నిల్వ రూ. 1,000 నుంచి రూ. 25 వేల దాకా కూడా నిర్వహించమని వినియోగదారులను కోరతాయి. లేకపోతే జరిమానా తప్పదు. బ్యాంకులు జరిమానాలు విధించినప్పుడు, సిబిల్ రిపోర్ట్‌లో ఈ విషయం నమోదవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చాలా ఖాతాలకు ఆన్‌లైన్ సౌకర్యం ఉంది. ఈ ఖాతాలను నిర్వహించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోసాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. ఎక్కువ ఖాతాలున్నప్పుడు ఆన్‌లైన్ కార్యకలాపాలను నిర్వహించడం (పాస్టవర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం, మార్చడం లాంటివి) కూడా కష్టమే.
ఛార్జీలు
మీరు బ్యాంకులో ఉండే ఖాతాలకు.. డెబిట్ కార్డు ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలతో సహా బ్యాంకును బట్టి అనేక ఛార్జీలను చెల్లించాలి. ఎన్ని ఖాతాలుంటే ప్రతి దానికీ విడివిడిగా ఛార్జీలుంటాయి. ప్రాథమిక పొదుపు ఖాతా, జీతం ఖాతా జీరో నగదు నిల్వతో లభించినా కూడా.. వీటితో ఎలాంటి సౌకర్యాలు లభించవు. తక్కువ ఖర్చుతో అన్ని ఖాతాలతో ఏదో ఒక ప్రయోజనం ఇమిడి ఉంటే బహుళ ఖాతాలను నిర్వహించొచ్చు. వాటి ఖర్చు ఎక్కువుండి తక్కువ ప్రయోజనముంటే ఖాతాలను మూసివేయడమే మంచిది.
సౌకర్యాలు ముఖ్యమే
బ్యాంకు ఖాతాను తెరవడానికి ముందే, ఖాతాకుండే సౌకర్యాలను చూడాలి. ఉదాహరణకు మీకు ప్రీమియం డెబిట్/క్రెడిట్ కార్డు, లాకర్ సౌకర్యం, ఏటీఎం నుంచి అధిక నగదు ఉపసంహరణ సౌకర్యం అవసరం కావచ్చు. మీకు అవసరమైన సౌకర్యాల రకాలను బట్టి, తక్కువ ఛార్జీలు, తక్కువ కనీస నిల్వ ఉండే బ్యాంకుల్లో ఖాతాను కలిగి ఉంటే మంచిది. మీకు ఎప్పటికీ అవసరం లేని సౌకర్యాలు ఉండి, అధిక వార్షిక నిర్వహణ రుసుములను విధించే బ్యాంకు ఖాతాలు అనవసరమే.
ఆర్థిక ప్రణాళిక నిర్వహణ
ప్రజలు సాధారణంగా జీవితంలో అనేక ఆర్థిక లక్ష్యాలను కలిగి ఉంటారు. వారి ప్రతి లక్ష్యంలో డబ్బు ఆదా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రతి లక్ష్యం కోసం ప్రత్యేక పొదుపు ఖాతాను కలిగి ఉండడం వల్ల బహుళ బ్యాంకు ఖాతాలను నిర్వహించడం కష్టమవుతుంది. కాబట్టి, స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను వేరు చేసి డబ్బు ఆదా చేయడానికి ప్రత్యేక బ్యాంకు ఖాతాలను నిర్వహించొచ్చు.
భారీ రుణానికి ప్లాన్ చేస్తుంటే..
చాలా మంది జీవిత కాలంలో కనీసం ఒక పెద్ద రుణమైనా తీసుకుంటారు. అది ఇంటి రుణం, వ్యాపార రుణం లేదా ఏదైనా కావచ్చు. ఈ రుణానికై.. వడ్డీ రేట్లు, ఛార్జీల పరంగా అత్యుత్తమ ఆఫర్‌ను అందించగల బ్యాంకు కోసం వెతుకుతారు. తక్కువ వడ్డీ రేటు/ఛార్జీలతో రుణం పొందడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీరు భవిష్యత్‌లో పెద్ద రుణం తీసుకోవాలనే ప్లాన్ కలిగి ఉంటే.. ఉత్తమమైన డీల్‌ను అందించే అవకాశం ఉన్న బ్యాంకును ముందుగానే పరిశోధన చేసి, ఖాతా తెరవడం మేలు. మంచి లావాదేవీ రికార్డు ఉండి, అప్పటికే ఉన్న ఖాతాదారులకు బ్యాంకు మెరుగైన డీల్‌ను అందిస్తుంది.
కాస్ట్-టు-బెనిఫిట్
బహుళ బ్యాంకు ఖాతాలున్నప్పుడు మీరు కాస్ట్-టు-బెనిఫిట్ విశ్లేషణ చేయాలి. ప్రతి బ్యాంకు ఖాతాను నిర్వహించడానికి ఎన్ని నిధులు అవసరం? మొత్తం వార్షిక ఛార్జీలు ఎంత? అనేది చెక్ చేసుకోవాలి. సాధారణంగా పొదుపు ఖాతాకు తక్కువ వడ్డీయే వస్తుంది. వడ్డీ తక్కువున్నా కూడా అనేక సౌకర్యాలు, ప్రయోజనాలు ఉంటే.. మీరు బ్యాంకు ఖాతాను కొనసాగించవచ్చు. ప్రయోజనాలు లేకుంటే ఆ బ్యాంకు ఖాతాను మూసివేయడానికి సిద్ధం కావాలి.
చివరిగా: వ్యక్తులు 2 లేదా 3 బ్యాంకు ఖాతాలను నిర్వహించడం వరకు పర్వాలేదు. అయితే సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడు ఖాతాలను నిర్వహించే ఓపిక, శ్రద్ధ ఉండాలి. దీంతో మీరు బ్యాంకు కార్యకలాపాలను సులభంగా చేయొచ్చు. ఖాతాలు కూడా యాక్టివ్‌గా ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల