India GDP: జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారత్‌ జీడీపీ 6.3%

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో (Q2) స్థూల జాతీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది.

Published : 30 Nov 2022 18:30 IST

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో (Q2) స్థూల జాతీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ (Q1) త్రైమాసికంతో పోలిస్తే (13.5 శాతం) సగం వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) సంబంధిత గణాంకాలను బుధవారం వెలువరించింది. 

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం 5.8 శాతంగా నమోదవ్వచ్చని అంచనాలను వెలువరించింది. ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ వెలువరించిన బులెటిన్‌లో సైతం వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య నమోదు కావొచ్చని అంచనా వేసింది. అంచనాలకు అటుఇటూగా గణాంకాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో పొరుగు దేశం చైనా వృద్ధి రేటు 3.9 శాతంగా నమోదు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని