FTP: భారత్‌కు కొత్త విదేశీ వాణిజ్య విధానం.. 2లక్షల కోట్ల డాలర్ల ఎగుమతులే లక్ష్యం
Foreign Trade Policy 2023: కొత్త ‘విదేశీ వాణిజ్య విధానాన్ని (FTP 2023)’ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఆవిష్కరించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
దిల్లీ: భారత ఎగుమతుల్ని 2030 నాటికి రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ‘విదేశీ వాణిజ్య విధానాన్ని (FTP 2023)’ ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఆవిష్కరించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
ఎప్పటిలా ఐదేళ్ల కాలపరిమితితో కాకుండా ఈసారి ఎఫ్‌టీపీ (Foreign Trade Policy)కి ఎలాంటి గడువును నిర్దేశించలేదు. కావాల్సినప్పుడల్లా మార్పులు చేర్పులు ఉంటాయని ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (DGFT)’ సంతోష్ సారంగి ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఎగుమతుల విలువ 760- 770 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. క్రితం ఏడాది ఇది 676 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గుర్తుచేశారు.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న విదేశీ వాణిజ్య విధానాన్ని 2015 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారు. ఐదేళ్ల గడువుతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ, మధ్యలో కొవిడ్ కారణంగా పలు దఫాల్లో పొడిగిస్తూ వచ్చారు. చివరిసారి 2022 సెప్టెంబరులో సవరించి 2023 మార్చి 31 వరకు పొడిగించారు. కొత్త ఎఫ్‌టీపీ (FTP 2023)లో కొత్త పట్టణాలను ‘టౌన్స్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్’ కింద ఎంపిక చేశారు. ఫరీదాబాద్, మొరాదాబాద్, మీర్జాపూర్, వారణాసి ఇందులో ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 39 పట్టణాలు టీఈఈల జాబితాలో ఉన్నాయి.
ఈసారి ఎఫ్‌టీపీ (FTP 2023) ప్రయోజనాలను ఇ-కామర్స్ ఎగుమతులకు కూడా విస్తరించారు. 2030 కల్లా వీటి విలువ రూ.200- 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. మరోవైపు కొరియర్‌లో ఒక్కో దఫాలో చేసే సరకు రవాణా విలువ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని ఎఫ్‌టీపీ (FTP 2023)లో ప్రతిపాదించారు. అందుకనుగుణంగా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను దేశీయ కరెన్సీలో జరిగేలా ప్రోత్సాహించాలని నిర్ణయించారు.
పాలసీలోని కీలకాంశాలు..
-
ఐదేళ్ల కాలపరిమితితో కాకుండా.. ఎఫ్‌టీపీ (FTP 2023)కి ఎలాంటి తుది గడువును నిర్ణయించలేదు. అవసరాన్ని బట్టి ఎప్పకప్పుడు మారుస్తారు
-
సరకుల ఎగమతులపై ప్రభుత్వం విధించే సుంకాలు, పన్నులపై తగ్గింపునిచ్చేలా పథకాన్ని ప్రకటించారు
-
ఎఫ్‌టీపీ (FTP 2023)కి సంబంధించిన దరఖాస్తుల డిజిటైజేషన్
-
దరఖాస్తులకు సిస్టమ్ ఆధారిత ఆటోమేటిక్ ఆమోదం
-
అడ్వాన్స్ ఆథరైజేషన్ కావాల్సిన దరఖాస్తుల ప్రాసెసింగ్ గడువును ఒకరోజుకు కుదించేలా ప్రయోగాత్మక ప్రాజెక్టు
-
‘యావరేజ్ ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్’ నుంచి పాడి పరిశ్రమకు మినహాయింపు
-
‘స్పెషల్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్’ వస్త్ర పరిశ్రమకూ విస్తరణ
-
ఇ-కామర్స్ ఎగుమతులకూ ఎఫ్‌టీపీ (FTP 2023) ప్రయోజనాలు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Highcourt: మద్యం పాలసీ మంచిదైతే.. ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?
-
General News
CM KCR: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: సీఎం కేసీఆర్
-
India News
Gulf countries: ఇకపై తక్కువ ఖర్చుతో గల్ఫ్ ప్రయాణం!
-
Politics News
హెడ్లైన్స్ కోసమే నీతీశ్ అలా చేస్తున్నారు.. విపక్షాల ఐక్యత కుదిరే పనేనా?: సుశీల్ మోదీ
-
Sports News
MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
-
India News
Gold Smuggling: ఆపరేషన్ గోల్డ్.. నడి సంద్రంలో 32 కేజీల బంగారం సీజ్