Education Loans: విద్యా రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..

ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు విద్యకై రుణాలిస్తున్నాయి. ఆ రుణాలకై ఎంతెంత వడ్డీ వసూలు చేస్తున్నాయో ఇక్కడ చూడండి.

Updated : 21 Jun 2024 16:03 IST

ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసించేవారికి సీజన్‌ మొదలయ్యింది. పెరుగుతున్న ఫీజుల భారాన్ని సొంతంగా భరించడం అనేది సామాన్య/మధ్యతరగతి కుటుంబాలకు శక్తికి మించిన పనే అని చెప్పాలి. అందుచేత ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ విద్యా ఖర్చుల నిమిత్తం బ్యాంకు రుణాలను ఆశ్రయిస్తున్నారు. విద్యా రుణాలు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో చదువుకుని వారి లక్ష్యాలను చేరుకోవాలనుకునే అనేక మంది విద్యార్థులకు మార్గాన్ని చూపుతున్నాయి. ఏటా విద్యా ద్రవ్యోల్బణం కూడా 10-12% పైనే ఉంటోంది. విద్యా రుణం అందజేసేటప్పుడు మీరు చేరే కళాశాల, కోర్సు వివరాలు, విద్యకు అయ్యే మొత్తం ఖర్చులు, అకాడమిక్‌ రికార్డ్స్‌, కుటుంబ ఆదాయం, ఆస్తులు మొదలైన వాటినన్నింటిని బ్యాంకులు చెక్‌ చేస్తాయి. అంతేకాకుండా గతంలో చేసిన చెల్లింపుల హిస్టరీనీ కూడా బ్యాంకులు చూస్తాయి. అర్హత ఉన్న రుణగ్రహీతలకు కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

గమనిక: ఈ పట్టికలో తెలిపిన వడ్డీ రేట్లలో ప్రాసెసింగ్‌ ఫీజులు కలపలేదు. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు చేస్తే, మరికొన్ని బ్యాంకులు రుణ మొత్తంలో 0.5% నుంచి 2% వరకు కూడా వసూలుజేస్తున్నాయి. క్రెడిట్‌ స్కోరు, వృత్తి, వయసు, వివిధ రుణ అర్హతలను బట్టి వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని