Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌లో కీలక పరిణామం.. వచ్చే ఏడాది నుంచి రెక్కలు

Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ త్వరలో రెక్కలు విచ్చుకోనుంది. సంస్థను దక్కించుకున్న కన్షార్షియం పరిష్కార ప్రక్రియకు సంబంధించి తాజాగా రూ.100 కోట్లు జమ చేసింది.

Updated : 29 Sep 2023 13:37 IST

Jet Airways | దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు (jet Airways) సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఎయిర్‌లైన్స్‌ను దక్కించుకున్న జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియం (Jalan Kalrock Consortium) తాజాగా రూ.100 కోట్లు నగదు జమ చేసింది. దీంతో ఆ సంస్థ రూ.350 కోట్లు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టింది. 2024 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్థిక కష్టాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. దీంతో కోర్టు ఆమోదించిన పరిష్కార ప్రక్రియకు అనుగుణంగా జేకేసీ (Jalan Kalrock Consortium) రూ.350 కోట్లు జమ చేసిందని ఓ ప్రకటనలో తెలిపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించాలన్న తమ ఆశయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

అమెజాన్‌ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..

వచ్చే ఏడాది నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని కన్షార్షియం భావిస్తోంది. లాంచ్‌ డేట్‌కు సంబంధించి తేదీలను కొన్ని వారాల్లో ప్రకటిస్తామని కన్షార్షియం పేర్కొంది. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారీ లాల్‌ జలాన్‌, యూకేకు చెందిన కర్లాక్‌ క్యాపిటల్‌ కలిసి దివాలా ప్రక్రియలో పాల్గొని బిడ్డింగ్‌లో జెట్ఎయిర్‌వేస్‌ను దక్కించుకున్నాయి. ఎప్పటి నుంచో కార్యకలాపాలను పునురుద్ధరించాలని భావిస్తున్నప్పటికీ.. అవాంతరాలు ఎదురవుతూ వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆకాశ మార్గంలో చూసే అవకాశం ఉంది. 1993లో ప్రారంభమైన జెట్‌ ఎయిర్‌వేస్‌.. 2019 వరకు దేశంతో పాటు వివిధ దేశాల్లోని మొత్తం 65 గమ్యస్థానాలకు 124 విమానాలతో సేవలందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు