Mothers Day: మాతృదినోత్సవం రోజున అమ్మకు ఈ బహుమతి ఇద్దామా!
Mothers Day: మన కోసం, మన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న అమ్మ కోసం, ఆమె ఆరోగ్యం కోసం సరైన ఆరోగ్య బీమా పాలసీని ఈ మాతృదినోత్సం సందర్భంగా మహుమతిగా ఇద్దాం!
Mother's Day | ఇంటర్నెట్ డెస్క్: సృష్టిలో ఎన్ని వింతలు విశేషాలున్నా.. అమ్మకు మించిన అద్భుతం మరోటి లేదు. ‘అందరం మన గురించి మాత్రమే ఆలోచిస్తాం.. అమ్మ మాత్రమే మన గురించి ఆలోచిస్తుంది’ అన్నారు వివేకానందుడు. ఏ కష్టమొచ్చినా మనకు మొదట గుర్తుకొచ్చేది అమ్మ. ఆరోగ్యం బాగోకపోతే అమ్మ ఆశ్రయం కోసం అల్లాడుతాం. మరి మన అమ్మ ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం. మరి ఈ మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా.. ప్రతి మహిళకు సరైన ఆరోగ్య భద్రత ఉండడం చాలా అవసరమని గుర్తిద్దాం!
కొంత మంది మహిళలకు వారి పనిచేసే కంపెనీలే బీమా (Insurance) సౌకర్యాన్ని కల్పిస్తాయి. మరికొంత మందికి ఫ్యామిలీ ఫ్లోటర్‌లో భాగంగా బీమా ఉంటుంది. కానీ, ఇప్పటికీ మన దేశంలో చాలా మంది మహిళలకు ఎలాంటి ఆరోగ్య బీమా సదుపాయం లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రతి స్త్రీకి ప్రత్యేకించి తల్లులకు ఆరోగ్య బీమా (Insurance) చాలా కీలకం. జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు పెరుగుతూ పోతాయి.
మహిళల కోసమే ప్రత్యేక ప్లాన్లు..
ఈ నేపథ్యంలో బీమా పరిశ్రమ సైతం మహిళల కోసం ప్రత్యేకంగా పాలసీలను అందిస్తోంది. గర్భాశయ క్యాన్సర్, యోని క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నవజాత శిశువులకు పుట్టుకతో వచ్చే వైకల్యాలు వంటి నిర్దిష్ట అనారోగ్యాలను కవర్ చేసే ప్రత్యేక బీమా (Insurance) పథకాలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు వారి ఆరోగ్య బీమా పాలసీలో భాగంగా ప్రసూతి కవరేజ్ నుంచే ప్రయోజనం పొందవచ్చు. ఇది సాధారణంగా ఎంచుకున్న బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తోనే కలిసి ఉంటుంది. గర్భం, ప్రసవానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. అంటే డెలివరీకి ముందు, ప్రసవం సమయంలో అయ్యే ఖర్చు, ఆసుపత్రిలో చేరడం, అంబులెన్స్ ఖర్చు, గది అద్దె ఛార్జీలు, తల్లీబిడ్డకు ఏవైనా ఇతర పూర్వ/ప్రసవానంతర సమస్యలు.. వంటివన్నీ పాలసీలో కవర్ అవుతాయి. అది సిజేరియన్ అయినా లేదా సహజ ప్రసవం అయినా బీమా వర్తిస్తుంది. సరైన ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు, పాలసీ డాక్యుమెంట్‌లోని అన్ని నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే కొన్ని పరిమితులు ఉండొచ్చు. ఎవరైనా తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన నిర్దిష్ట పరిమితులు, నిరీక్షణ వ్యవధి నిబంధనలు ఎప్పుడూ ఉంటాయని గుర్తించుకోవాలి.
అనుబంధ ప్రయోజనాలు..
ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీలతో పాటు, అనేక బీమా (Insurance) కంపెనీలు ఔట్ పేషెంట్ ఖర్చులను కవర్ చేసే రైడర్ ప్రయోజనాలనూ అందిస్తాయి. వీటిలో డాక్టర్ సంప్రదింపులు, ల్యాబ్ పరీక్షల సమయంలో అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి. అపరిమిత టెలీకన్సల్టేషన్ను అందిస్తాయి. OPD కవర్ మరొక ముఖ్య ప్రయోజనం. ముందస్తు ఆరోగ్య తనిఖీలు కూడా అదనపు వెసులుబాటు. ప్రతి వ్యక్తి సమగ్ర ఆరోగ్య ప్రణాళికను కలిగి ఉండాలి. మహిళలకు ఇది మరీ ముఖ్యం. తల్లులుగా మహిళలు విభిన్నమైన పాత్రను పోషిస్తారు. అనేక బాధ్యతలను మోస్తారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు తగినంత కవరేజీని కలిగి ఉండటానికి మానసిక అనారోగ్య చికిత్స, టాప్-అప్ పాలసీలను విస్తరించే వెసులుబాటు ఉన్న ప్లాన్‌ను ఎంచుకోవాలి.
అమ్మకు దూరంగా ఉన్నా..
వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల కొంతమంది తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం అంత సులభమైన అంశం కాదు. అందుకే బీమా సంస్థలు 360-డిగ్రీల సంపూర్ణ బీమా (Insurance) పాలసీలను అందజేస్తున్నాయి. ఇవి సీనియర్ సిటిజన్ల తక్షణ అవసరాలను తీర్చేలా ఉంటాయి. అంబులెన్స్ సేవలు, స్మార్ట్‌వాచ్ సహాయంతో ఫాల్ డిటెక్షన్ టెక్నాలజీ, ఇంట్లో నర్సింగ్ కేర్ వంటి అనేక కవరేజీలు అందుతాయి.
సరైన ఆరోగ్య బీమా పథకం ఉండడం అందరికీ చాలా అవసరం. ముఖ్యంగా మహిళలకు ఇది తప్పనిసరి. సరైన బీమా (Insurance) కవరేజీ ఉండడం వల్ల వారితో పాటు వారి కుటుంబం కూడా రక్షణతో ఉన్నట్లు మహిళలు భావిస్తారు. తద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తారు. మన కోసం, మన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న అమ్మ కోసం, ఆమె ఆరోగ్యం కోసం సరైన ఆరోగ్య బీమా పాలసీని ఈ మాతృదినోత్సం (Mother's Day) సందర్భంగా బహుమతిగా ఇద్దాం!
- తపన్ సింఘేల్, ఎండీ అండ్ సీఈఓ, బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్‌బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్