LIC Jeevan Kiran policy: ఒకే పాలసీతో ఓవైపు కుటుంబానికి ఆర్థిక భరోసా.. మరోవైపు పొదుపు!

LIC Jeevan Kiran policy: ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ పేరిట అందిస్తున్న పాలసీతో ఇటు పొదుపుతో పాటు కుటుంబానికి రక్షణ కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు.

Published : 04 Sep 2023 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ జీవిత బీమా (LIC) సంస్థ ఇటీవల జీవన్‌ కిరణ్‌ (LIC Jeevan Kiran) పేరిట ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇది నాన్‌-పార్టిసిపేటివ్‌, నాన్‌- లింక్డ్‌ పథకం. అంటే హామీ మొత్తం, ప్రయోజనాల విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ఇది కుటుంబానికి రక్షణతో పాటు పొదుపు సాధనంగానూ పనిచేస్తుంది. పాలసీదారుడి అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి నిర్దిష్ట హామీ మొత్తం అందుతుంది. ఒకవేళ పాలసీ (LIC Jeevan Kiran) కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు ఉంటే.. మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను అందిస్తారు. దీన్ని ఏజెంట్లు, ఎల్‌ఐసీ కార్యాలయాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

ప్రధాన ఫీచర్లు..

  • ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ (LIC Jeevan Kiran) కుటుంబానికి ఆర్థిక రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి హామీ మొత్తం లభిస్తుంది. అలాగే కాలపరిమితి ముగిసే వరకు జీవించి ఉంటే.. మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ అందుతాయి.
  • ఎల్‌ఐసీకి వచ్చే లాభాల్లో నుంచి పాలసీదారులకు ప్రయోజనాలను ఇస్తారు. బోనస్‌ల రూపంలో ఇవి అందుతాయి. ఈ నేపథ్యంలో కనీస హామీ మొత్తంతో పాటు అదనపు డబ్బు కూడా అందుతుంది.
  • ప్రీమియం చెల్లించడానికి పాలసీదారుడిని కాలపరిమితి విషయంలో వెసులుబాటు ఉంటుంది. వార్షిక, ఆరు నెలలు, మూడు నెలలు, నెల.. ఇలా వీలును బట్టి ప్రీమియం చెల్లించొచ్చు.
  • ప్రీమియం విలువ ఒక నిర్దిష్ట మొత్తం దాటిన తర్వాత పాలసీని సరెండర్‌ చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. కొన్ని నిబంధనలకు లోబడి సరెండర్‌ విలువ మొత్తాన్ని అందిస్తారు.
  • అత్యవసరంగా డబ్బులు అవసరమైన సమయంలో ఈ పాలసీ (LIC Jeevan Kiran)ని తనఖాగా వాడుకొని రుణం కూడా పొందొచ్చు.

జీవన్‌ కిరణ్‌ పాలసీకి కావాల్సిన అర్హతలు..

ప్రయోజనాలు..

  • అకాల మరణం సంభవిస్తే..

ఒకవేళ పాలసీదారుడు ప్రమాదవశాత్తు పాలసీ కాలపరిమితి ముగిసే లోపే మరణిస్తే.. నామినీ కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది. కనీస హామీ మొత్తాన్ని కుటుంబానికి అందజేస్తారు. అలాగే బోనస్‌లు, ఇతర ప్రయోజనాలేమైనా ఉన్నా వర్తింపజేస్తారు.

కనీస హామీ మొత్తం కింది వాటిలో ఏది అధికంగా ఉంటే అది..

రెగ్యులర్‌ ప్రీమియం పేమెంట్‌ ఎంచుకున్నవారికి..

  • వార్షిక ప్రీమియం మొత్తానికి ఏడు రెట్లు
  • మరణించే నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం
  • పాలసీలో పేర్కొన్న కనీస హామీ మొత్తం

ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించిన వారికి..

  • చెల్లించిన ఏక మొత్తం ప్రీమియంలో 125%
  • పాలసీలో పేర్కొన్న కనీస హామీ మొత్తం

మెచ్యూరిటీ ప్రయోజనాలు..

ఒకవేళ పాలసీ కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే.. మెచ్యూరిటీ ప్రయోజాలు అందుతాయి. గడువు ముగిసే నాటికి చెల్లించిన ప్రీమియంల మొత్తం చేతికి అందుతుంది. సింగిల్‌ ప్రీమియం పేమెంట్‌ పాలసీకీ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఆ సమయానికి ఎల్‌ఐసీ ఏమైనా ప్రత్యేకంగా బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు ప్రకటించి ఉంటే వాటిని కూడా అందజేస్తారు.

పన్ను ప్రయోజనాలు..

ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ పాలసీకి చెల్లించిన ప్రీమియంలకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.

ఇతర రైడర్లు..

జీవన్‌ కిరణ్‌ బేస్‌ పాలసీకి అదనంగా రైడర్లను కూడా జత చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ప్రమాద బీమాను కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి పాలసీదారుడికి మరణిస్తే వారి కుటుంబానికి అదనపు హామీ మొత్తం అందజేస్తారు. అంగవైకల్యం సంభవించినా.. నిర్దిష్ట హామీ మొత్తాన్ని ఇస్తారు.

  • రూ.20 లక్షల కనీస హామీ మొత్తం కోసం నమూనా పాలసీ ఇలా ఉంటుంది (పొగ తాగని వారికి)..

రెగ్యులర్‌ ప్రీమియం..

సింగిల్‌ ప్రీమియం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని