LIC Results: రాణించిన ఎల్‌ఐసీ.. నికర లాభం 14 రెట్లు జంప్‌

LIC Q1 Results: త్రైమాసిక ఫలితాల్లో ఎల్‌ఐసీ రాణించింది. నికర లాభం ఏకంగా రూ.9,544 కోట్లకు పెరిగింది.

Published : 10 Aug 2023 19:37 IST

దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో రూ.9,544 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.683 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాదితో పోలిస్తే నికర లాభం దాదాపు 14 రెట్లు పెరిగింది. ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం సైతం రూ.1.68 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది.

SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. UPIతో ఆ క్రెడిట్‌కార్డుల అనుసంధానం

సమీక్షా త్రైమాసికంలో తొలి ఏడాది ప్రీమియంల వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. గతేడాది ఈ మొత్తం రూ.7,429 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.6,811 కోట్లకు పరిమితమయ్యాయి. అలాగే పెట్టుబడుల ద్వారా రూ.90,309 కోట్ల ఆదాయం వచ్చినట్లుు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది ఈ మొత్తం రూ.69,571 కోట్లుగా ఉంది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే.. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.48 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గింది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేర్లు గురువారం స్వల్పంగా (0.36%) క్షీణించి రూ.641.60 వద్ద ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని