Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market Closing Bell: స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ 31 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్ల మేర లాభపడ్డాయి.

Updated : 09 Jan 2024 16:18 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) మంగళవారం తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీలు.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితంగా ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయిన సూచీలు.. ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ ఉదయం 71,770.91 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ (Sensex) ఒకదశలో 72వేల మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే, చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీ 71,307 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.

చివరకు 30.99 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386.21 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ (Nifty) కూడా 31.85 పాయింట్ల లాభంతో 21,544.85 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పెరిగి 83.11గా స్థిరపడింది. హీరో మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, అపోలో హాస్పిటల్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు రాణించగా.. నెస్లే ఇండియా, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని