Nokia mobiles: యూపీఐ సదుపాయంతో నోకియా కొత్త ఫీచర్‌ ఫోన్లు

Nokia mobiles: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా రెండు చౌక మొబైల్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లూ యూపీఐ సదుపాయంతో వస్తుండడం గమనార్హం.

Published : 05 Jul 2023 18:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా (Nokia) రెండు ఫీచర్‌ ఫోన్లను భారత విపణిలోకి తీసుకొచ్చింది. నోకియా 110 4జీ, నోకియా 110 2జీ పేరుతో ఈ కొత్త ఫోన్లు లాంచ్‌ చేసింది. 4జీ, 2జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్లలో దుమ్మూ, నీరు లోనికి ప్రవేశించకుండా IP52 రేటింగ్‌తో వస్తున్నాయి. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం కనెక్షన్‌తో పాటు యూపీఐ ఫీచర్‌తో ఈ ఫోన్లు తీసుకొస్తుండడం ప్రత్యేకత.

నోకియా 110 4జీ (Nokia 110 4G)

ఈ మొబైల్‌ ఫోన్‌ ధర రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్ బ్లూ, ఆర్పిక్‌ పర్పుల్‌ ఈ రెండు రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎఫ్‌ఎం రేడియో సదుపాయం, డిజిటల్‌ లావాదేవీల కోసం యూపీఐ సదుపాయం ఇందులో ఉంది. నోకియా 110 4 జీ నానో సిమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ 4జీ మొబైల్‌లో ఎంపీ3 ప్లేయర్‌ను ఇచ్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ, హెచ్‌డీ వాయిస్‌ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 32 జీబీ వరకు ఎక్టర్నల్‌ స్టోరేజ్‌ పెంచుకొనే సదుపాయం ఉంది. QVGA కెమెరా సెన్సార్‌ను వెనక భాగంలో ఇచ్చారు. మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌, సింగిల్‌ స్పీకర్‌, మైక్రోఫోన్‌, 3.5 ఎంఎం జాక్ ఇందులో ఇస్తున్నారు. ఈ ఫోన్‌ 1,450mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 8 గంటల టాక్‌టైమ్‌, 12 రోజుల స్టాండ్‌బై టైమ్‌ వస్తుంది.
Also read: బ్యాటరీ లైఫ్‌పై యాపిల్‌ ఫోకస్‌.. బిగ్‌ బ్యాటరీతో ఐఫోన్‌ 15 సిరీస్‌!

నోకియా 110 2జీ (Nokia 110 2G)

ఈ ఫోన్‌ ధర రూ.1,699గా కంపెనీ నిర్ణయించింది. చార్‌కోల్‌, క్లౌడీ బ్లూ రంగుల్లో మొబైల్‌ఫోన్‌ లభిస్తుంది. ఈ 2జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లోనూ నోకియా 110 4జీ మొబైల్‌కు ఉన్న దాదాపు అన్ని సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ మినీ సిమ్ కార్డుకు సపోర్ట్‌ చేస్తుంది. హెచ్‌డీ వాయిస్ కాలింగ్‌ సదుపాయం మాత్రం ఇందులో ఉండదు. అలాగే,  3.5 ఎంఎం జాక్, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఇందులో లేదు. ఈ మొబైల్‌లో 1,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు నోకియా వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ స్టోర్లలోనూ లభిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని