Paytm: టిక్కెట్లు రద్దు చేసుకుంటే 100% వెనక్కి: పేటీఎం

Paytm: దీపావళి సందర్భంగా రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలను అందిస్తున్నట్లు పేటీఎం వెల్లడించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా బస్సు టిక్కెట్ల కొనుగోలుపై రూ.500 వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది.

Updated : 05 Nov 2023 09:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలను అందిస్తున్నట్లు పేటీఎం (Paytm) వెల్లడించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా బస్సు టిక్కెట్ల కొనుగోలుపై రూ.500 వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. పేటీఎం (Paytm) నుంచి రైలు టిక్కెట్టును కొనుగోలు చేసి, ప్రయాణానికి ఆరు గంటల ముందు వరకూ రద్దు చేసుకున్నా, తక్షణమే వారి ఖాతాలోకి మొత్తం డబ్బు జమ అవుతుందని పేర్కొంది. తత్కాల్‌ సహా, అన్ని టిక్కెట్లకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు ఎలాంటి అదనపు రుసుములూ ఉండవని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని