Paytm: ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. ‘ఎక్స్‌’ వేదికగా పేటీఎం బాస్‌ పోస్టు

పేటీఎం(Paytm) క్యూఆర్‌, సౌండ్‌ బాక్సులకు సంబంధించిన వదంతులపై జాగ్రత్తగా ఉండాలని ఆ సంస్థ వినియోదారుల్ని అప్రమత్తం చేసింది. 

Published : 19 Feb 2024 16:47 IST

దిల్లీ: ఆర్‌బీఐ(RBI) ఆంక్షల వేళ సంస్థ కార్యకలాపాలపై వ్యక్తమవుతోన్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. పేటీఎం(Paytm) బాస్ విజయ్ శేఖర్ శర్మ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. ఈ డిజిటల్ పేమెంట్స్‌ యాప్‌ గురించి ఓ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటనను షేర్ చేసి, స్పష్టత ఇచ్చారు.

అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన పేటీఎం షేర్లు

‘భారత్‌లోని పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్సులు పనిచేస్తూనే ఉంటాయి. ఈ రోజు, రేపు, ఎల్లప్పుడూ పేటీఎం చేయండి’ అని పోస్టు పెట్టారు. అలాగే క్యూఆర్‌, సౌండ్‌ బాక్సులకు సంబంధించిన వదంతులపై జాగ్రత్త అంటూ ఆ పోస్టులో సంస్థ హెచ్చరించింది. జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ(RBI) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పీపీబీఎల్‌ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలపై ఆడిట్ నివేదిక తర్వాతే ఈ చర్యలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని