Paytm Results: తగ్గిన పేటీఎం నష్టం.. ఆదాయంలో వృద్ధి

paytm q2 results: పేటీఎం సంస్థ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ2లో రూ.292 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గతేడాది పోలిస్తే భారీగా తగ్గడం గమనార్హం.

Published : 20 Oct 2023 19:37 IST

Paytm Results | దిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం (వన్‌97 కమ్యూనికేషన్స్‌) త్రైమాసిక ఫలితాలను (Paytm q2 results) ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.291 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.571 కోట్లతో పోలిస్తే నష్టం దాదాపు సగం వరకు తగ్గడం గమనార్హం. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా కంపెనీకి వచ్చే ఆదాయంలో వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.1914 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.2518.6 కోట్లకు పెరిగింది.

సమీక్షా త్రైమాసికంలో మొత్తం రూ.16,211 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు పేటీఎం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే కొత్తగా 14 లక్షల మంది వ్యాపారులు తమ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చి చేరారని పేర్కొంది. ఈ త్రైమాసికంలో సగటున నెలకు 9.5 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు పేటీఎం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 1.2 శాతం మేర పెరిగి రూ.980.05గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని