Paytm: గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో పేటీఎం భారీ పెట్టుబడి?

గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీని ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చడానికి.. పేటీఎం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

Published : 10 Jan 2024 22:37 IST

పేటీఎం(Paytm) బ్రాండ్‌ను కలిగి ఉన్న ఫిన్‌టెక్‌ సంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌-సిటీ (గిఫ్ట్‌)లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ బుధవారం తెలిపింది. గిఫ్ట్‌ సిటీ ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా అవతరించనుంది. పేటీఎం, వినియోగదారుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను పరిచయం చేయడానికి ఒక ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తోంది. పేటీఎం, గిఫ్ట్‌ సిటీలో ఒక డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది, ఇది ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)తో తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించడం ద్వారా ఇతర దేశాలకు చెల్లింపులను క్రమబద్ధీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాలను గాంధీనగర్‌లోని మూడు రోజుల 'వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌'కు ముందు ఒక ప్రకటనలో పేటీఎం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని