Realme GT 3: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్.. 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్!
Realme GT 3 Features: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్‌ను రియల్‌మీ లాంచ్ చేసింది. ఫోన్ బ్యాటరీ కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ (Realme) తీసుకొచ్చింది. జీటీ సిరీస్‌లో రియల్‌మీ జీటీ 3ని ( Realme GT 3) మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో లాంచ్ చేసింది. 240W ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. దీనివల్ల 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్లపై లుక్కేద్దాం..
రియల్‌మీ జీటీ 3 ఐదు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128జీబీ, 12 జీబీ+256 జీబీ, 16జీబీ+256జీబీ, 16జీబీ+ 512 జీబీ, 16జీబీ+1టీబీ వేరియంట్లో వస్తోంది. దీని ధర ఎంత అనేది వెల్లడి కాలేదు. బేస్ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ.53,500 నుంచి ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. అమ్మకాలు సైతం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేదీ కంపెనీ వెల్లడించలేదు. గతేడాది ఏప్రిల్‌లో రియల్ మీ జీటీ2 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
రియల్‌మీ జీటీ3 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 13తో రియల్‌మీ యూఐ 4.0తో వస్తోంది. 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్, 144Hz రీఫ్రెషర్ రేటు కలిగిన డిస్‌ప్లే అమర్చారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సర్ అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు ప్రత్యేకతల గురించి. ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్.. రెండోది ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్. ఇందులో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 240W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా తొలి 50 శాతం బ్యాటరీని కేవలం నాలుగు నిమిషాల్లో, ఫుల్ బ్యాటరీని 9.3 నిమిషాల్లోనే ఛార్జ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక వెనుక వైపు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్ 25 రంగులు వెలువరిస్తుంది. కాల్స్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎల్‌ఈడీ అలర్ట్ వస్తుంది. యూజర్ తనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?