Home Loan: గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
Home Loan: గృహరుణం.. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇది ఒక అవసరం. కానీ, వాస్తవంలో ఒక దీర్ఘకాలిక భారం. తక్కువ వడ్డీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది ఉండదు కానీ, 8 శాతానికి మించి వడ్డీ రేట్లు ఉన్న ప్రస్తుత తరుణంలో వడ్డీ బరువు మోయాల్సిందే.
Home Loan | గృహరుణం.. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇది ఒక అవసరం. కానీ, వాస్తవంలో ఒక దీర్ఘకాలిక భారం. తక్కువ వడ్డీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది ఉండదు కానీ, 8 శాతానికి మించి వడ్డీ రేట్లు ఉన్న ప్రస్తుత తరుణంలో వడ్డీ బరువు మోయాల్సిందే. చాలామంది పదవీ విరమణ చేసిన తర్వాతా గృహరుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని (Home Loan) వేగంగా తీర్చేయడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
మీ గృహరుణం (Home Loan) తీసుకున్న బ్యాంకు దగ్గరకు ఒకసారి వెళ్లండి. మీరు తీసుకున్న రుణం, వర్తిస్తున్న వడ్డీ.. ఇంకా ఎన్నాళ్లు చెల్లించాలి అనే వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు బ్యాంకులు, గృహరుణ (Home Loan) సంస్థలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోనే రుణానికి సంబంధించిన వివరాలన్నీ అందిస్తున్నాయి. వీటిని పరిశీలించండి. అప్పుడే మీరు తీసుకున్న రుణంపై మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ఏం చేయాలన్నది నిర్ణయించుకోవడం సులభం అవుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నప్పుడు అనేక ఆర్థిక లక్ష్యాలు వెనక్కి వెళ్లిపోతాయి. వీటిని సాధించేందుకు రాజీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి, ఈ రుణాన్ని తొందరగా తీర్చే ప్రయత్నం చేయాలి.
- మీ రుణాన్ని (Home Loan) వేగంగా చెల్లించాలంటే ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించాలి. మీ ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు, పెట్టుబడులు, రుణ వాయిదాలు పోను మిగులు మొత్తం కనిపిస్తే.. దాన్ని రుణం తీర్చేందుకు వినియోగించవచ్చు.
- వృథా ఖర్చులను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. అప్పుడే మిగులు మొత్తం పెరుగుతుందన్న సంగతిని గుర్తించాలి. ఇలా మిగులు మొత్తంతో ఏడాదికోసారి రుణం (Home Loan) అసలును చెల్లించే ప్రయత్నం చేయాలి.
- ఏడాదికి 12 నెలలు వాయిదాలు చెల్లించాలి. కానీ, రుణం (Home Loan) తొందరగా తీర్చాలంటే.. మీరు ఏడాదికి 14 నెలలు ఉన్నాయనుకోవాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గి, రుణం తొందరగా తీరుతుంది. ఇతర లక్ష్యాల కోసం మీరు పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది. బాకీ ఉన్న రుణ మొత్తంలో ఏటా 5-7 శాతం చెల్లిస్తే రుణ వ్యవధి గణనీయంగా తగ్గుతుంది. ఏడాదికి ఒక ఈఎంఐ అదనంగా చెల్లించినా.. మూడేళ్ల ముందే అప్పు తీరుతుంది.
- మీ బ్యాంకులో వసూలు చేస్తున్న వడ్డీ.. మిగతా బ్యాంకుల్లో ఉన్న వడ్డీని పోల్చి చూడండి. 0.5 శాతం వరకూ వ్యత్యాసం ఉంటే.. పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, 1 శాతం వరకూ అధికంగా ఉందంటే మాత్రం ఆలోచించాల్సిందే. బ్యాంకు లేదా రుణ సంస్థను మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం తదితరాలను బట్టి, రీఫైనాన్సింగ్ చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. ఈఎంఐ తగ్గితే, ఇతర పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. ముందుగా వర్తించే ఫీజుల గురించి తెలుసుకోండి.
- మీకు అనేక రుణాలు ఉంటే.. వాటిని నిర్వహించడం కష్టం కావచ్చు. సాధ్యమైనంత మేరకు రుణాలను (Home Loan) ఏకీకృతం చేసేందుకు ప్రయత్నించండి. వడ్డీ అధికంగా ఉన్న వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలను తీర్చేందుకు ప్రయత్నించండి.
- కొంతమంది అధిక వడ్డీకి రుణాలు (Home Loan) తీసుకొని, తమ వద్ద ఉన్న డబ్బును తక్కువ వడ్డీ వచ్చే డిపాజిట్లలో జమ చేస్తుంటారు. ఇది మంచిది కాదు. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకొని, మిగతా మొత్తాన్ని రుణాన్ని చెల్లించేందుకు వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రెడిట్ స్కోరు పెంచుకుందామిలా
ఆర్థిక ప్రణాళికలో క్రెడిట్ స్కోరు ఎంతో కీలకంగా మారింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. మీ ఆర్థిక ఆరోగ్యం, బాధ్యతకూ ప్రతిబింబం. ఎప్పుడైనా అనివార్య కారణాలతో ఈ స్కోరు తగ్గొచ్చు. -
FD Rates: వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించాయి. వివిధ కాలపరిమితులు గల ఎఫ్డీలపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. -
నెలకు రూ.8 వేలతో రూ.5 కోట్లు
నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
Gold Loan: అత్యవసరంలో పసిడి రుణం..
వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం. -
Loan Mistakes: రుణాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రతి ఒక్కరు ఏదో సమయంలో ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్నవారే. రుణాలు తీసుకునేటప్పుడు, ఎలాంటి తప్పులు చేయడానికి అవకాశముంటుందో ఇక్కడ చూడండి. -
Interest rates: వ్యక్తిగత రుణాలు ప్రియం కానున్నాయా? కారణం ఇదే!
Personal Loans: ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
టాపప్ రుణం తీసుకుంటున్నారా?
రుణం తీసుకొని, వాటికి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న వారికి బ్యాంకులు టాపప్ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇలా ఇచ్చిన అప్పు అప్పటికే ఉన్న రుణం అసలుకు కలిపేస్తారు. అప్పుడు రుణ మొత్తం, వ్యవధి పెరుగుతుంది. ఇ -
Interest Rates: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యెస్ బ్యాంక్
యెస్ బ్యాంకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. -
SCSSలో మార్పులు.. రిటైర్డ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు అందేలా!
Senior Citizens Savings Scheme | రిటైర్డ్ ఉద్యోగులు సహా వారి జీవితభాగస్వాములకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేలా ‘సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్’లో ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసింది. -
Two Wheeler Loan: ద్విచక్ర వాహన రుణాలు.. ఏయే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు ద్విచక్ర వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు ఇక్కడ తెలుసుకోండి.. -
SBI Wecare: ఎస్బీఐ వియ్‌కేర్ గడువు పొడిగింపు.. వారికి ఎఫ్డీపై 7.50% వడ్డీ
SBI wecare deadline extended: ఎస్బీఐ తన వియ్ కేర్ పథకం గడువును మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. -
Credit Cards: కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు.. వీటిపై ఓ లుక్కేయండి!
Co-branded credit cards | అవసరాలకు అనుగుణంగా చేసే కొనుగోళ్లపై అదనపు ప్రయోజనాలు ఇచ్చేవే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు. మార్కెట్లో ఉన్న కొన్ని అలాంటి కార్డుల వివరాలను చూద్దాం..! -
FD Interest Rates: బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రైవేట్ బ్యాంకులు ఒక సంవత్సరం ఎఫ్డీలపై 7%, అంతకన్నా ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. -
Home Loan: ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు ఏయే బ్యాంకుల్లో ఎంతెంత?
దాదాపు అన్ని బ్యాంకులు ఇంటి కొనుగోలుకు రుణాలిస్తున్నాయి. ఈ రుణాలకు వసూలుజేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు. -
కారు రుణం తీసుకుంటున్నారా?
కొత్త కారు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? రుణం ఎక్కడ తీసుకోవాలా అని చూస్తున్నారా? దీనికన్నా ముందు కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. అవేమిటో చూద్దామా... -
Home Loan: పండగ సీజన్లో హోంలోన్.. ఆఫర్ ఒక్కటే చూస్తే సరిపోదు!
Home Loan: పండగ సీజన్ నేపథ్యంలో బ్యాంకులు గృహ రుణాలపై ఆఫర్లు ఇస్తున్నాయి. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి తరుణం. అయితే, కేవలం ఆఫర్‌ను మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా పరిశీలించి లోన్ తీసుకోవాలి. -
Personal Loan: తక్కువ క్రెడిట్ స్కోరున్నవారు వ్యక్తిగత రుణం పొందొచ్చా?
Personal loan: తక్కువ క్రెడిట్ స్కోరున్నవారు వ్యక్తిగత రుణాన్ని పొందడానికి కొన్ని మార్గాలు, అవకాశాలున్నాయి. అవేంటో చూడండి. -
ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలు
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకూ, దివ్యాంగులకూ బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందించే ఏర్పాట్లు చేసింది. -
Bank Cheque: బ్యాంకు చెక్కు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
బ్యాంకు చెక్కు రాయడం చాలా సులభమైన పనే. కానీ, చెక్కులను జారీ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
Credit card: క్రెడిట్ కార్డు తీసుకొని వాడట్లేదా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Credit card: ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు.. ఒకే కార్డుపై అన్ని కొనుగోళ్లనూ పూర్తి చేయొద్దు. వీలును బట్టి, అన్ని కార్డులను వాడేందుకు ప్రయత్నించాలి. ఎందుకో చూద్దాం.. -
Reliance SBI Card: రిలయన్స్ ఎస్బీఐ భాగస్వామ్యంలో క్రెడిట్ కార్డ్.. ప్రయోజనాలు ఇవే!
Reliance SBI Card features: రిలయన్స్ ఎస్బీఐ కార్డు భాగస్వామ్యంలో కో బ్రాండ్ క్రెడిట్‌కార్డును తీసుకొచ్చారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో కొనుగోళ్లపై రివార్డులు లభిస్తాయి.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
-
Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్ షా
-
The Archies Review: రివ్యూ: ది ఆర్చిస్.. బాలీవుడ్ వారసుల మూవీ ఎలా ఉంది?
-
ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!