SBI Wecare: ఎస్‌బీఐ వియ్‌కేర్‌ గడువు పొడిగింపు.. వారికి ఎఫ్‌డీపై 7.50% వడ్డీ

SBI wecare deadline extended: ఎస్‌బీఐ తన వియ్‌ కేర్‌ పథకం గడువును మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

Updated : 20 Nov 2023 15:54 IST

SBI Wecare | ఇంటర్నెట్ డెస్క్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన వియ్‌- కేర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం (SBI WeCare ) గడువును మరోసారి పొడిగించింది. సీనియర్‌ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని ఎస్‌బీఐ తెలిపింది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఎస్‌బీఐ ఇవ్వనుంది. కొత్తగా డిపాజిట్‌చేసే వారు, రెన్యువల్స్‌పై ఈ పథకాన్ని పొందొచ్చు. 

సీనియర్‌ సిటిజన్లకు సాధారణ  పౌరులతో పోలిస్తే అందించే 50 బేసిస్‌ పాయింట్లతో పాటు.. కార్డు రేటుపై 50 బేసిస్‌ పాయింట్లు కలిపి మొత్తంగా 100 బేసిస్‌ పాయింట్లు అదనంగా వియ్‌ కేర్‌ కింద అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 60 ఏళ్లు దాటిన వారే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా లేదా బ్యాంకు శాఖకు వెళ్లి ఈ డిపాజిట్‌ చేయొచ్చు. కనీస వ్యవధి 5 ఏళ్లు. గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు కొనసాగించుకోవచ్చు. రూ.2 కోట్ల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. డిపాజిట్‌ హామీగా రుణం తీసుకునే వెసులుబాటు ఉంది.

Credit Cards: కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు.. వీటిపై ఓ లుక్కేయండి!

ఒక్క ఎస్‌బీఐనే కాదు ఐసీఐసీఐ బ్యాంక్‌ సైతం గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీ పేరిట ఇదే తరహా పథకాన్ని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్‌లకు అందించే 50 బేసిస్ పాయింట్లతో పాటు 10 బేసిస్‌ పాయింట్లు అదనంగా వడ్డీ ఇస్తోంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల  కాలవ్యవధిపై 7.50 శాతం వడ్డీ లభిస్తోంది. 2023 ఏప్రిల్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ సైతం ఇదే తరహా పథకాన్ని అందించినప్పటికీ.. దాని గడువు ఇటీవలే ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని