Credit Cards: కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు.. వీటిపై ఓ లుక్కేయండి!

Co-branded credit cards | అవసరాలకు అనుగుణంగా చేసే కొనుగోళ్లపై అదనపు ప్రయోజనాలు ఇచ్చేవే కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు. మార్కెట్‌లో ఉన్న కొన్ని అలాంటి కార్డుల వివరాలను చూద్దాం..!

Updated : 20 Nov 2023 12:38 IST

Co-branded credit cards | ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి కొత్త క్రెడిట్‌ కార్డులు వస్తుంటాయి. సాధారణ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే కో-బ్రాండెండ్‌ కార్డుల (Co-branded credit cards) వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు.. ఇలా మొదలైన వాటితో కలసి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు వీటిని తీసుకొస్తాయి. ఈఎంఐ (EMI)లపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ రుసుములపై రాయితీ వంటి ప్రయోజనాలు ఉంటాయి. మీ అలవాట్లకు సరిపోయే కార్డును ఎంపిక చేసుకొని.. సమర్థంగా వాడుకోగలిగితే ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని మెరుగైన కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు వివరాలను (Co-branded credit cards) చూద్దాం..

రిలయన్స్‌-ఎస్‌బీఐ కార్డు..

ఈ కార్డుకు జాయినింగ్‌ ఫీజు రూ.499. జీఎస్టీ అదనం. వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద రూ.500 విలువ చేసే రిలయన్స్‌ రిటైల్‌ వోచర్‌ను అందిస్తారు. ఏడాదికి రూ.1లక్షపైన కొనుగోళ్లు జరిపితే మరుసటి ఏడాది రెన్యువల్‌ ఫీజు ఉండదు. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్‌లో కొనుగోళ్లపై ప్రతి రూ.100కు 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఫ్యూయల్‌ సర్‌ఛార్జి లేదు. ట్రెండ్స్‌, అజియో, సెంట్రో, జివామె, అర్బన్‌ లేడర్‌, జియో మార్ట్‌ ద్వారా కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంట్లో రూ.2999తో ప్రీమియం కార్డు కూడా ఉంది. ఈ కార్డుతో వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద రూ.3000 విలువ చేసే రిలయన్స్‌ రిటైల్‌ వోచర్‌ను ఇస్తారు. ఏడాదిలో రూ.3 లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్లపై వార్షిక ఫీజు ఉండదు. రిలయన్స్‌ స్టోర్లలో చేసే ప్రతి రూ.100 కొనుగోలుపై 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. బుక్‌మై షోలో ప్రతి నెలా రూ.250 విలువ చేసే మూవీ టికెట్‌ ఫ్రీ. దేశీయ విమానాశ్రయాల్లో ఏడాదిలో 8 లాంజ్‌ యాక్సెస్‌లు ఉంటాయి. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో 4 లాంజ్‌ యాక్సెస్‌లు లభిస్తాయి. 1 రివార్డు పాయింట్‌ = 0.25 పైసలు.

అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డు..

ఈ కార్డు అమెజాన్‌లో తరచూ షాపింగ్‌ చేసేవారికి సరిపోతుంది. ఎలాంటి జాయినింగ్‌, వార్షిక ఫీజు లేదు. కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. ఆ మొత్తం అమెజాన్‌ పే వ్యాలెట్‌లో జమ అవుతుంది. తదుపరి కొనుగోళ్లలో ఈ మొత్తాన్ని వాడుకోవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు 5%, నాన్‌-ప్రైమ్‌ కస్టమర్లకు 3% క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డు..

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అధికంగా చేసే వారిని దృష్టిలో ఉంచుకొని ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ కార్డును తీసుకొచ్చింది. క్యాష్‌బ్యాక్‌ ఈ కార్డు ప్రత్యేకత. ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. స్విగ్గీ ఆర్డర్లపై రూ.600 వరకు తగ్గింపు లభిస్తుంది. కల్ట్‌.ఫిట్‌, స్విగ్గీ, పీవీఆర్‌, టాటా ప్లే, క్లియర్‌ట్రిప్‌, ఉబర్‌పై 4% క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది.

మింత్రా కోటక్‌ క్రెడిట్‌ కార్డు..

పై రెండు కార్డుల్లాగే దీన్ని ప్రత్యేకంగా మింత్రా కస్టమర్ల కోసం రూపొందించారు. వార్షిక ఫీజు రూ.500. జాయినింగ్‌ ఆఫర్‌ కింద రూ.500 మింత్రా వోచర్‌ లభిస్తుంది. మింత్రా కొనుగోళ్లపై 7.5% వరకు తగ్గింపు ఉంటుంది. స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, పీవీఆర్‌, క్లియర్‌ట్రిప్‌, అర్బన్‌ కంపెనీ కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. రూ.2 లక్షలపైన ఖర్చు చేస్తే వార్షిక ఫీజు రద్దు.

స్విగ్గీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డు..

స్విగ్గీ ఫుడ్‌, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుండడం స్విగ్గీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డు ప్రత్యేకత. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, నైకా, ఓలా, ఉబర్‌, ఫార్మాఈజీ, నెట్‌మెడ్స్‌, బుక్‌ మై షోలో లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ మొత్తం స్విగ్గీ మనీలో జమ అవుతుంది. దాన్ని స్విగ్గీలో ఇతర లావాదేవీలకు వినియోగించుకోవచ్చు. ఈ కార్డు జాయినింగ్‌ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. ఈ కార్డు వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద మూడు నెలల పాటు స్విగ్గీ వన్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది.

యాత్రా ఎస్‌బీఐ కార్డు..

యాత్రా ప్లాట్‌ఫామ్‌పై బుక్‌ చేసుకునే విమాన ప్రయాణాలు, హోటల్‌ రూంలపై ఈ కార్డుతో రాయితీలు లభిస్తాయి. జాయినింగ్‌ ఫీజు రూ.499. రూ.1లక్షపైన ఖర్చు చేస్తే వార్షిక ఫీజు రద్దు. వెల్‌కమ్‌ బెనిఫిట్‌ కింద రూ.8,250 యాత్రా వోచర్‌ లభిస్తుంది. కనీసం రూ.5,000 దేశీయ విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1000 తగ్గింపు. కనీసం రూ.40 వేల అంతర్జాతీయ విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.4000 తగ్గింపు ఉంటుంది. దేశీయ హోటల్‌ బుకింగ్‌లపై 20 శాతం రాయితీ లభిస్తుంది. అయితే, బుకింగ్‌ విలువ రూ.3,000 దాటాలి. యాత్రా వేదికపై బుక్‌ చేసుకున్న విమాన టికెట్లపై రూ.50 లక్షల ఎయిర్‌ యాక్సిడెంట్‌ బీమా కవర్‌ ఉంటుంది.

(గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ప్రత్యేకంగా ఒక కార్డును తీసుకోమని సిఫార్సు చేయడం లేదు. క్రెడిట్‌ కార్డులపై కొన్ని షరతులు ఉంటాయి. వాటిని పరిశీలించిన తర్వాత మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగానే కార్డును ఎంపిక చేసుకోవాలి.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని