Budget 2023: మహిళల కోసం కొత్త స్కీమ్‌.. వృద్ధులకు గుడ్‌న్యూస్‌

బడ్జెట్‌లో మహిళల కోసం కేంద్రం ప్రత్యేక సేవింగ్స్‌ స్కీమ్‌ తీసుకొచ్చింది. అలాగే, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది.

Published : 01 Feb 2023 13:15 IST

దిల్లీ: మహిళలకు, వృద్ధులకు బడ్జెట్‌లో (Budget 2023) కేంద్రం గుడ్ న్యూస్‌ చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే, సీనియర్‌ సిటిజన్లు డిపాజిట్‌ చేసే గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది.

  • మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే కొత్త పథకాన్ని బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
  • సీనియర్‌ సిటిజన్లకు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంది. దీన్ని రూ.30 లక్షలకు వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 
  • మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ పరిమితిని సైతం కేంద్రం సవరించింది. ఇప్పుడున్న 4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్‌ అకౌంట్‌ కలిగిన వారికి ప్రస్తుతం ఉన్న రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ పథకంపై ప్రస్తుతం 7.10% వడ్డీ లభిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని