Stock Market: బేర్‌మన్న స్టాక్‌ మార్కెట్‌.. నష్టపోయిన సూచీలు

Stock Market Closing Bell: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 670 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 197 పాయింట్లు కోల్పోయింది.

Updated : 08 Jan 2024 17:11 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు ఈ వారంలో వెలువడబోయే టెక్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ (Sensex) 670 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ (Nifty) 197 పాయింట్లు కోల్పోయింది.

ఈ ఉదయం 72,113 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 71,301 వద్ద కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు 670.93 పాయింట్లు పతనమై 71,355.22 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 21,492-21,763 పాయింట్ల మధ్య కదలాడి.. చివరకు 197.80 పాయింట్ల నష్టంతో 21,513 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.14గా స్థిరపడింది.

 అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఓఎన్జీసీ, హీరో మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు రాణించగా.. యూపీఎల్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, బ్రిటానియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని