FD Rates: ఎఫ్‌డీలపై గరిష్ఠ వడ్డీ రేట్లు ఆఫర్‌ చేస్తున్న స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకులివే

ఈ బ్యాంకులు తమ డిపాజిటర్లకు అత్యధిక వడ్డీ రేటునందిస్తున్నాయి.

Published : 25 Nov 2022 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ రెపో రేటు పెంపుతో కొన్ని ప్రముఖ బ్యాంకులు తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7% వడ్డీ ఇస్తుండగా.. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఇప్పటికే తమ డిపాజిట్లపై 7.65% పైన వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. పెరుగుతున్న క్రెడిట్‌ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకు డిపాజిట్లలో వృద్ధిని సాధించలేకపోవడంతో బ్యాంకులు ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లతో డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ధోరణి కొనసాగితే డిపాజిట్‌ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

అధిక వడ్డీనిచ్చే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి..

గమనిక: అన్ని బ్యాంకుల లాగానే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఎఫ్‌డీలపై డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది. అందుచేత స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేసేటప్పుడు రూ. 5 లక్షల పరిమితి పరిధిలో ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని