Tata group: హల్దీరామ్స్‌పై టాటాల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు చర్చలు!

హల్దీరామ్స్‌లో వాటా కొనుగోలుకు టాటా గ్రూప్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అదే జరిగితే పెప్సీకి టాటా గ్రూప్‌ గట్టి పోటీ ఇవ్వనుంది.

Published : 06 Sep 2023 16:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ (Tata group) ప్యాకేజీ ఫుడ్‌ బిజినెస్‌పై కన్నేసింది. స్నాక్స్‌ తయారు చేసే హల్దీరామ్స్‌ (Haldirams) కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల తెలిపాయి. అయితే, హల్దీరామ్స్‌ వాల్యుయేషన్‌ అధికంగా పేర్కొంటుండడంపై టాటా గ్రూప్‌ అనాసక్తి వ్యక్తం చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

హల్దీరామ్స్‌లో 51 శాతం వాటాల కొనుగోలుకు టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ.. ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, హల్దీరామ్ 10 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌గా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో హల్దీరామ్ చెప్తున్న విలువ చాలా ఎక్కువగా ఉందని టాటా పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఈ వ్యవహారాన్ని మార్కెట్‌ ఊహాగానాలుగా టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రతినిధి కొట్టిపారేశారు. అటు.. హల్దీరామ్స్‌ దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.

6,000mAh బ్యాటరీ..50MP కెమెరాతో మోటో జీ54 5జీ ఫోన్‌

ఒకవేళ టాటా-హల్దీరామ్స్‌ చర్చలు సఫలీకృతమైతే.. స్నాక్స్ మార్కెట్‌లో లేస్‌ పేరిట స్నాక్స్‌ను విక్రయిస్తున్న పెప్సీకి టాటా గ్రూప్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు 10 శాతం వాటా విక్రయానికి ప్రైవేటు ఈక్విటీ సంస్థ బెయిన్‌ క్యాపిటల్‌తో సైతం హల్దీరామ్స్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ టెట్లీ, టాటా సాల్ట్‌, హిమాలయన్‌ పేరిట ఉత్పత్తులను విక్రయిస్తోంది. 1937లో ఓ చిన్న షాప్‌గా ప్రారంభమైన హల్దీరామ్స్‌.. ఇప్పుడు దేశంలో అతిపెద్ద స్నాక్స్‌ కంపెనీగా అవతరించింది. ఈ సెగ్మెంట్‌లో 13 శాతం మార్కెట్‌ వాటా ఉంది. సింగపూర్‌, యూఎస్‌ సహా ఇతర మార్కెట్లలోనూ హల్దీరామ్స్‌ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని