TCS: వేతన పెంపు, ప్రమోషన్లకు టీసీఎస్‌ ‘నిబంధన’

వేతన పెంపు, ప్రమోషన్లకు సంబంధించి తమ ఉద్యోగులకు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS) నిబంధనలు పెట్టింది.

Published : 03 Feb 2024 05:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేతన పెంపు, ప్రమోషన్లకు సంబంధించి తమ ఉద్యోగులకు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS) నిబంధనలు పెట్టింది. రిటర్న్‌- టు- ఆఫీస్‌ నిబంధనలకు అనుగుణంగా జీతాల పెంపు, ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించింది. దీనికి సంబంధించి తమ బృందాలకు తెలియజేయాలని అన్ని శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కార్యాలయం నుంచి పని చేస్తున్న వారి ట్రాక్‌ రికార్డు, పనితీరులో ఉద్యోగులకు ఇచ్చే గ్రేడ్లు ఆధారంగా ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు అమలు చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలానే కంపెనీలో చేరిన ఫ్రెషర్స్‌, వారికి కేటాయించిన కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తేనే.. వార్షిక వేతనం ₹3లక్షల కంటే ఎక్కువ జీతాలకు అర్హులని తెలిపింది. 

గతేడాది అక్టోబర్‌ మొదటి వారంలోనే వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి టీసీఎస్‌ ముగింపు పలికింది. ఉద్యోగులంతా కార్యాలయాలకు రావడం ఎంత అవసరమో కంపెనీ 2022-23 వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ‘‘ఉద్యోగులు కంపెనీ వాతావరణంలో పనిచేయడం చాలా ముఖ్యం. ఇది మంచి ఫలితాలనిస్తుంది. నూతన ఉద్యోగులు.. తమ సీనియర్లు, టీమ్‌ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు పరస్పరం చర్చించుకోకుండా అభివృద్ధి సాధ్యం కాదు’’ అని కంపెనీ సీఈవో క్రితివాసన్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని