WPI inflation: 19 నెలల కనిష్ఠానికి దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం

WPI inflation: ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గిన నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. 

Published : 14 Nov 2022 15:33 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ఠానికి దిగిరావడం విశేషం. అక్టోబరులో డబ్ల్యూపీఐ సూచీ 8.39 శాతంగా నమోదైంది. ఇంధనం, తయారీ వస్తువుల ధరలు దిగిరావడమే ఇందుకు దోహదం చేసింది. దాదాపు 18 నెలల తర్వాత టోకు ద్రవ్యోల్బణం రెండంకెల దిగువకు చేరడం గమనార్హం. 2021 మార్చిలో నమోదైన 7.89 శాతమే చివరిది. 

ఖనిజ చమురు, ప్రాథమిక లోహాలు, లోహ ఉత్పత్తులు, వస్త్రాలు, ఖనిజాల ధరలు తగ్గడం ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమైనట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపింది. సెప్టెంబరులో 11.03 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.03 శాతానికి తగ్గింది. కూరగాయల్లో 39.66 శాతం నుంచి 17.61 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గింది. ఇంధనం-విద్యుత్తు ద్రవ్యోల్బణం 23.17 శాతానికి, తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 4.42 శాతానికి దిగొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని