logo

రాళ్లపై నడిచెళ్లి ఓట్లేసేదెలా?

నిజాంపట్నం మండలంలో గుర్నాథనగర్‌ నుంచి హారిస్‌పేట వెళ్లే రహదారి పూర్తిగా రూపురేఖలు మారి అధ్వానంగా ఉంది.

Published : 16 Apr 2024 05:06 IST

నిజాంపట్నం మండలంలో గుర్నాథనగర్‌ నుంచి హారిస్‌పేట వెళ్లే రహదారి పూర్తిగా రూపురేఖలు మారి అధ్వానంగా ఉంది. రాళ్లు లేచి ప్రయాణికులకు నడకా పరీక్షలా మారింది. రానున్న ఎన్నికల్లో గుర్నాథనగర్‌, ఎడ్లంక నుంచి సుమారు 200మంది ఓటర్లు 2 కి.మీ దూరంలో ఉన్న అంజనాపురం పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు ఈ రహదారిపై నడిచి వెళ్లాల్సి ఉంది. రాళ్లు తేలిన దారిలో ఎండలో ఎలా నడవాలని కనీసం ఎన్నికల సమయానికైనా రహదారి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ విద్యాసాగర్‌ వద్ద ప్రస్తావించగా రహదారి తమ శాఖ పరిధిలోనిదని గతంలో పంచాయతీరాజ్‌ శాఖ స్వాధీనం చేసుకుందని నాలుగేళ్ల క్రితమే అప్పగించాలని కోరామని వారు ఆ ప్రక్రియ పూర్తి చేస్తే పనులు చేయిస్తామన్నారు.

న్యూస్‌టుడే, నిజాంపట్నం (రేపల్లె అర్బన్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని