logo

పేదల పెన్నిధి ఎన్టీఆర్‌: నందమూరి బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్ధంతిని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు

Published : 19 Jan 2022 03:59 IST


ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు పూలమాలలేసి నివాళులు అర్పిస్తున్న నటుడు బాలకృష్ణ

బంజారాహిల్స్‌ న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్ధంతిని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలోని బసవతారకం, ఎన్టీఆర్‌ విగ్రహాలకు ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భార్య బసవతారకం క్యాన్సర్‌తో మృతిచెందడంతో ఆయన ఎంతో వేదనకు గురయ్యారని, అలాంటి దుస్థితి పేదలకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో బసవతారకం ఆస్పత్రిని స్థాపించారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు అత్యుత్తమ చికిత్స రోగులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్‌ డైరెక్టర్‌ (యాడ్‌ లైఫ్‌) డా.కల్పనా రఘునాథ్‌, మెడికల్‌ అంకాలజీ విభాగాధిపతి డా.సెంథిల్‌ రాజప్ప, రేడియాలజీ విభాగాధిపతి డా.వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని