logo

Crime News: పూజలు చేసి ప్రసాదాలు ఇస్తే పిల్లలు పుడతారని నమ్మించి..

పూజలు చేసి ప్రసాదం ఇస్తే పిల్లలు పుడతారని నమ్మించి.. మహిళల మెడలో నగలు చోరీ చేస్తోంది అంతర్రాష్ట్ర ముఠా ఒకటి. నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ చందన

Updated : 16 Mar 2022 08:51 IST

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: పూజలు చేసి ప్రసాదం ఇస్తే పిల్లలు పుడతారని నమ్మించి.. మహిళల మెడలో నగలు చోరీ చేస్తోంది అంతర్రాష్ట్ర ముఠా ఒకటి. నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ చందన దీప్తి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్రకు చెందిన గోవింద్‌ మనోజ్‌జాదవ్‌(27) కన్నయ్యకిషన్‌ సాలుంకి(51), అశోక్‌ సురేష్‌జాదవ్‌(44)లు బంధువులు. వీరి ప్రాంతంలో మద్య నిషేధం ఉంది. దీంతో వీరు బయటనుంచి మద్యాన్ని తెచ్చి దొంగచాటుగా అమ్ముతుంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతుంటారు. గతంలో పలు కేసుల్లో జైలు వెళ్లారు. కొద్ది రోజుల కిత్రం రైలులో నగరానికి వచ్చిన ఈ ముఠా.. లాడ్జిలో అద్దెకు దిగి చోరీలకు పథకం వేసింది. శివరాత్రి ముందు రోజు మోండా ఆదయ్యనగర్‌లో నివాసముంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి.. మార్కెట్‌లో పూజ సామగ్రి కొని ఇంటికి వెళుతోంది. ఆమె వద్దకు ముగ్గురు ఒక్కసారిగా వచ్చారు. కాళ్లకు మొక్కారు. ఏమిటని ఆమె ప్రశ్నిస్తే.. పిల్లలు పుట్టడానికి పూజలు చేయించామని, ఆ ప్రసాదం ఐదుగురు ముత్తయిదువులకు ఇవ్వాలని పండితులు చెప్పారని నమ్మించారు. మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చారు. అది తిని ఆమె అక్కడే పడిపోయారు. ఆమెవద్ద ఉన్న 7తులాల బంగారు నగలతో ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. నగలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండుకు తరలించారు. అశోక్‌ కోసం గాలిస్తున్నారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు