logo

‘ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ భద్రత నిపుణుల కొరత’

ప్రపంచ దేశాలు సమర్థులైన సైబర్‌ భద్రత నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయని మైక్రోసాఫ్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేట్‌ బెన్కెన్‌ అన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఐసీటీ అకాడమీ భాగస్వామ్యంతో సైబర్‌ శిక్షా ఫర్‌ ఎడ్యుకేటర్స్‌

Published : 25 Jun 2022 02:38 IST

పత్రాలను చూపుతున్న  కేట్‌ బెన్కెన్‌, హరిబాలచంద్రన్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలు సమర్థులైన సైబర్‌ భద్రత నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయని మైక్రోసాఫ్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేట్‌ బెన్కెన్‌ అన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఐసీటీ అకాడమీ భాగస్వామ్యంతో సైబర్‌ శిక్షా ఫర్‌ ఎడ్యుకేటర్స్‌ పేరిట శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేట్‌ బెన్కెన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) హైదరాబాద్‌ డైరెక్టర్‌ రాంప్రసాద్‌, ఐసీటీ అకాడమీ ఆఫ్‌ తమిళనాడు సీఈవో హరి బాలచంద్రన్‌ మాట్లాడారు. అనంతరం ఐసీటీ, మైక్రోసాఫ్ట్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని