logo

తొలిరోజు తప్పించుకున్నా.. రెండో రోజు చిక్కాడు

గతనెల 27న హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులు చాలారోజులుగా రెక్కీ నిర్వహించి పథకాన్ని పక్కాగా అమలు చేశారు. హతుడికి నిందితులు తెలిసినవారే కావడంతో అతను పూర్తిగా నమ్మడం ప్రణాళిక అమలు సునాయాసమైంది.

Published : 06 Jul 2022 02:11 IST

నారాయణరెడ్డి హత్య కేసులో పక్కాగా రెక్కీ

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: గతనెల 27న హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులు చాలారోజులుగా రెక్కీ నిర్వహించి పథకాన్ని పక్కాగా అమలు చేశారు. హతుడికి నిందితులు తెలిసినవారే కావడంతో అతను పూర్తిగా నమ్మడం ప్రణాళిక అమలు సునాయాసమైంది. అతన్ని హత్య చేసేందుకు ఒకరోజు తీసుకెళ్లినా పథకం పారలేదు. ఆరోజు తప్పించుకున్నా రెండోరోజు నిందితులు సఫలీకృతులయ్యారు. వివరాలివీ.. తన కూతురు రవళిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మామ నారాయణరెడ్ఢి. తమ బంధువు, దిల్‌సుఖ్‌నగర్‌లో ఐస్‌క్రీం పార్లర్‌లో పనిచేసే శ్రీనివాసరెడ్డితో తన ప్రణాళిక గురించి వివరించాడు. అడ్డు తొలగించేందుకు రూ.4.50 లక్షలతో బేరం కుదిరింది.

గతనెల 26న.. రాత్రి శ్రీనివాస్‌రెడ్డి అతని మిత్రులతో నారాయణరెడ్డి గదికి వెళ్లి విందు చేసుకుందామని తీసుకెళ్లాడు. శ్రీనివాసరెడ్డి తనకూ పరిచయం ఉండటంతో నారాయణరెడ్డి వారితో వెళ్లాడు. పార్టీ మధ్యలో ఉండగా నారాయణరెడ్ఢి. తన గదిలో ఉన్న బావకు ఫోన్‌ చేసి తనను పికప్‌ చేసుకోవాలని కోరాడు. దీంతో కంగు తిన్న శ్రీనివాస్‌రెడ్ఢి. పథకాన్ని అమలు చేస్తే దొరికిపోతామని భావించి తామే గది వద్ద దింపుతామంటూ నారాయణరెడ్డితో చెప్పారు. అన్నట్లుగానే అతన్ని ఆరోజు రాత్రి దింపేసి వెళ్లిపోయారు.

మరుసటి రోజు.. సాయంత్రం 6.30 గంటల సమయంలో శ్రీనివాస్‌రెడ్డి తన మిత్రులతో కలిసి నారాయణరెడ్డి గదికి వెళ్లి కారులో ఎక్కించుకుని మళ్లీ విందుకంటూ తీసుకెళ్లారు. అయితే కొంతసేపటికి గది నుంచి మిత్రులు ఫోన్‌ చేయడంతో ముందురోజు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి, అతని మిత్రులతోనే ఉన్నానని చెప్పిన నారాయణరెడ్డి తర్వాత అందుబాటులో లేకుండా పోయాడు. తర్వాత నారాయణరెడ్డిని మట్టుబెట్టడం, జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని దహనం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నారాయణరెడ్డి గది వద్ధ. జిన్నారం అటవీ ప్రాంతంలో పగడ్బందీగా రెక్కీ నిర్వహించకుంటే ఇలా పక్కాగా చేయగలిగేవారు కాదని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని