logo

9 నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవ ‘ద్విసప్తాహం’

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ‘ద్విసప్తాహం’లో భాగంగా ఈ నెల 9 నుంచి 21 వరకు రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను....

Updated : 06 Aug 2022 04:19 IST

రవీంద్రభారతి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ‘ద్విసప్తాహం’లో భాగంగా ఈ నెల 9 నుంచి 21 వరకు రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు విడుదల చేశారు. 9న ‘జాతీయోధ్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ‘వందేమాతరం’ నృత్య కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం. గురు కళాకృష్ణ బృందం (75 మందితో) పేరిణి నాట్య ప్రదర్శన.

* 10: గాంధీజీ ఆశయ గీతాలతో జయలక్ష్మి బృందం ‘వీణ కచేరి’, ప్రమోద్‌కుమార్‌రెడ్డి బృందం నృత్యాలు.

* 11: స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రేకెత్తించే నాట్య ప్రదర్శనలు, పిడమర్తి క్రాంతి బృందం, రాఘవరాజ్‌ భట్‌ బృందాల నృత్యాలు.

* 12: రవీంద్రుని గీతాలతో ఆనంద శంకర్‌ జయంత్‌ బృందం ‘కావ్యాంజలి’ నృత్య ప్రదర్శన

* 13: జాతీయ సమైక్యత గీతాలాపన ‘పాడవోయి భారతీయుడా’.

* 14: ‘తల్లిభారతి వందనం’ శీర్షికన ఆకాశవాణి కళాకారుల బృందంతో దేశభక్తి గీతాలాపన.

* 15: ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ‘సారే జహాసే అచ్ఛా- హిందుస్థాన్‌ హమారా’ నృత్య కార్యక్రమాలు.

* 16: సాహిత్య అకాడమీ సారథ్యంలో‘స్వాతంత్య్ర స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి’ కవి సమ్మేళనం.

* 17: భారత స్వాతంత్ర సమరం భావాలతో పాటల కార్యక్రమం, రామాచారి బృందంచే ‘పుణ్యభూమి నా దేశం నమో.. నమామి’ గీతాలహరి.

* 18, 19 తేదీల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘భారతీయ కళా వైభవం- భిన్నత్వంలో ఏకత్వం’ అంశంపై దేశంలోని వివిధ నృత్య కళల సమాహారం.

* 20: డా.కోట్ల హనుమంతరావు, డా.అనిత బృందంచే భారత జాతీయోద్యమ ఘట్టాలపై ‘వందేమాతరం’ నృత్యరూపకం.

* 21: భారతమాతకు జేజేలు శీర్షికన పి.సుశీల, ఎస్‌.పి.శైలజ సారథ్యంలో సినీ దేశభక్తి గీతాలాపన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని