‘మురుగు’ వ్యర్థం.. సేంద్రియ ఆదాయం
వందశాతం మురుగు శుద్ధి లక్ష్యంగా పెట్టుకున్న జలమండలి అధికారులు.. మురుగుశుద్ధి ప్రక్రియతో పాటు సంబంధిత వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చుతున్న సంస్థలకు విక్రయిస్తున్నారు.
‘స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్’ పట్టణాల్లో అమలుచేస్తున్న యంత్రాంగం
ఈనాడు, హైదరాబాద్: వందశాతం మురుగు శుద్ధి లక్ష్యంగా పెట్టుకున్న జలమండలి అధికారులు.. మురుగుశుద్ధి ప్రక్రియతో పాటు సంబంధిత వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చుతున్న సంస్థలకు విక్రయిస్తున్నారు. దశాబ్దాలుగా మురుగునీటిని శుద్ధిచేస్తూ ఇతర అవసరాలకు పునర్వినియోగిస్తున్న జలమండలి అధికారులు, మూడునాలుగేళ్ల నుంచి మురుగునీటి వ్యర్థాలపై దృష్టి కేంద్రీకరించారు. శుద్ధి ప్రక్రియలో భాగంగా వ్యర్థాలను వేరుచేసి రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశంలోనే వందశాతం మురుగుశుద్ధి చేస్తున్న తొలినగరంగా పేరుపొందాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో జలమండలి ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ఈ నెల నుంచి మురుగు వ్యర్థాలను శుద్ధిచేసి మూడు సంస్థలకు ఇస్తున్నారు.
ఆధునిక సాంకేతికత సాయంతో.. మురుగు వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడం కొత్త విధానం కాకపోయినా, వ్యర్థాల్లోని విషపదార్థాలు. రసాయనాలను పూర్తిగా తొలగించేందుకు ఇటీవల అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. మురుగుశుద్ధి కేంద్రాల్లో(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఒక ఛాంబర్‌లోకి మురుగునీరు వెళ్లగానే ఐదు దశల్లో శుద్ధి అవుతుంది. తొలిమూడు దశల్లో ఛాంబర్‌లోని యంత్రాలు, పరికరాలు ఘనవ్యర్థాలను వేరుచేస్తాయి. తర్వాతి రెండు దశల్లో నీటిని పూర్తిగా శుద్ధిచేస్తాయి. ఆనక జలమండలి అధికారులు మురుగు వ్యర్థాలను ట్రక్కులు, ట్యాంకర్లలో సేంద్రియ ఎరువుగా మార్చే కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆయా వ్యర్థాలను కొనుగోలు చేస్తున్న సంస్థలు వాటిని మరిన్ని రసాయనాలతో శుద్ధిచేసి ఎరువుగా మార్చి తెలుగు రాష్ట్రాల్లో పది జిల్లాల్లోని రైతులకు సరఫరా చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు..
మురుగునీటి శుద్ధి ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులకు ఎంపికైన నగరాలు, పట్టణాలకు ప్రోత్సాహకాలను అందజేస్తోంది. అక్కడ ఎంతశాతం శుద్ధి చేస్తున్నారు? పునర్వినియోగం ఏమేరకు ఉంది? అనే అంశాలను నివేదిక ద్వారా సమర్పించిన నగరాలకు మరిన్ని నిధులూ సమకూర్చుతోంది. స్మార్ట్‌సిటీ పథకాన్ని అమలుచేస్తున్న ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ మురుగు,ఘన వ్యర్థాలను శుద్ధిచేశాక, వాటిల్లోని విషపదార్థాలు, సూక్ష్మజీవులను నాశనం చేసేందుకు రేడియేషన్ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఇందుకోసం బాబా ఆటమిక్ పరిశోధన కేంద్రం(బార్క్)తోనూ గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ అమలుచేస్తున్న నగరాల్లోనూ మురుగు వ్యరాలను శుద్ధి చేసి సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్న సంస్థలకు ఇస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Vijayawada: అసాధారణంగా సీఏల అరెస్టులు: ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్
-
General News
MLC Kavitha: డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే పెద్ద ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత
-
Movies News
Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ‘కాంతార’ హీరో
-
Crime News
Jangareddygudem: కత్తితో దంపతులు, కుమారుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
-
India News
Kapil Sibal: సుపారీ ఇచ్చినవారి పేర్లు చెప్పండి..! ప్రధాని మోదీకి కపిల్ సిబల్ విజ్ఞప్తి
-
Movies News
Samantha: చీకటి రోజులు.. ఆ బాధ నుంచి నేనింకా కోలుకోలేదు.. విడాకుల రోజులపై సమంత వ్యాఖ్యలు