logo

ఈ నెల 11న సాహితీ దినోత్సవం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

దేశంలో ఏ పథకమైనా తెలంగాణ నుంచే అందుబాటులోకి వస్తోందని.. స్వయంగా కవి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

Updated : 09 Jun 2023 11:21 IST

హైదరాబాద్‌ : దేశంలో ఏ పథకమైనా తెలంగాణ నుంచే అందుబాటులోకి వస్తోందని.. స్వయంగా కవి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణలో కవులు లేరని ఎద్దేవా చేసిన వారికి చెంప పెట్టులా.. కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఘన చరిత్రను చాటి చెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 11న రాష్ట్రంలో సాహితీ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో సాహితీవేత్తలకు సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహితీవేత్తలకు పోటీలు పెట్టనున్నట్లు చెప్పారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని