logo

కీళ్ల నొప్పులకు అత్యాధునిక వైద్యం

మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధుల కంటే కీళ్లనొప్పుల బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని,  దీనికి భారత్‌లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ అన్నారు.

Published : 14 Aug 2023 02:51 IST

వేదికపై కీళ్ల వైద్య నిపుణులతో పుల్లెల గోపీచంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధుల కంటే కీళ్లనొప్పుల బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని,  దీనికి భారత్‌లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ అన్నారు. బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో యశోద హాస్పిటల్స్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన లోయర్‌ లింబ్‌ జాయింట్‌ ప్రిజర్వేషన్‌, జాయింట్‌ రీప్లేస్మెంట్స్‌ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ జనాభాలో దాదాపు 14 శాతం మంది ఏటా కీళ్లనొప్పులతో వైద్యులను సంప్రదిస్తున్నారని తెలిపారు. ప్రారంభ దశలో కీళ్లను సంరక్షించుకోవడం వల్ల వాటి నొప్పుల బారిన పడకుండా నివారించవచ్చన్నారు. యశోద హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ జీయస్‌ రావు మాట్లాడుతూ.. సదస్సులో అత్యాధునిక రోబోటిక్‌, లాప్రోస్కోపిక్‌, ఓపెన్‌ టెక్నిక్‌ ద్వారా కీళ్లమార్పిడి శస్త్రచికిత్సలు ఎలా చేయాలో యువ వైద్యులకు ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ నట్టా కుల్కమ్టన్‌ (థాయ్‌లాండ్‌), డాక్టర్‌ పరాక్రమ (కొలొంబో), డాక్టర్‌ జాసన్‌ ఐర్‌ (ఇంగ్లాండ్‌), భారత్‌కు చెందిన డాక్టర్లు విజయ్‌ భాస్కర్‌, విజయ్‌ కుమార్‌, 250 మంది యువ డాక్టర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని