logo

తొలి ప్రథమ పౌరుడు..ఎమ్మెల్యే ఆయనే

శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉన్న 13 గ్రామ పంచాయతీలు, 7 శివారు గ్రామాలను కలుపుతూ 1987లో శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ఏర్పడింది

Updated : 26 Oct 2023 04:33 IST

శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉన్న 13 గ్రామ పంచాయతీలు, 7 శివారు గ్రామాలను కలుపుతూ 1987లో శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ఏర్పడింది. ఆ తర్వాత 1988లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఎం.భిక్షపతియాదవ్‌ విజయం సాధించి శేరిలింగంపల్లి మున్సిపాలిటీ మొదటి ఛైర్మన్‌గా సేవలందించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండే శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ప్రాంతం 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో శేరిలింగంపల్లి నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన భిక్షపతియాదవ్‌ గెలుపొంది శేరిలింగంపల్లి మొదటి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా మొదటి మున్సిపల్‌ ఛైర్మన్‌గా, మొదటి ఎమ్మెల్యేగా ఆయన పేరు నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయింది. రానున్న ఎన్నికల్లో భిక్షపతియాదవ్‌ భాజపా అభ్యర్థిగా తన కుమారుడు రవికుమార్‌యాదవ్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని