logo

Hyderabad: హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది..

రాజధానిలో ఈసారి పలువురు హ్యాట్రిక్‌ విజయం సాధించారు. వరుసగా మూడోసారి గెలుపొంది నియోజకవర్గంలో పట్టు నిలుపుకొన్నారు.

Updated : 04 Dec 2023 07:27 IST

రాజధానిలో ఈసారి పలువురు హ్యాట్రిక్‌ విజయం సాధించారు. వరుసగా మూడోసారి గెలుపొంది నియోజకవర్గంలో పట్టు నిలుపుకొన్నారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ డబుల్‌ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


అక్బరుద్దీన్‌.. డబుల్‌ హ్యాట్రిక్‌

ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ 1999లో తొలిసారి గెలిచారు. ఆ తర్వాత  2004, 2009, 2014, 2018లో... ఇప్పుడు తిరుగులేని ఆధిక్యం సాధించారు.


గోషామహల్‌ నుంచి భాజపాఅభ్యర్థి  రాజాసింగ్‌ వరుసగా మూడోసారి గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018లో ఎన్నికయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండై ఆఖరి నిమిషంలో భాజపా టికెట్‌ ఇవ్వగా మూడోసారి విజయం సాధించారు.


మంత్రి తలసాని2014లో తెదేపా నుంచి 2018, 2023లో భారాస పక్షాన విజేతగా నిలిచారు.1994,1999, 2008లోనూ గెలిచారు. మొత్తంగా 6సార్లు గెలిచారు.


జూబ్లీహిల్స్‌లో భారాస అభ్యర్థిగోపీనాథ్‌ 2014లో  తెదేపా నుంచి  2018లో భారాస నుంచి గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ సాధించారు.


శేరిలింగంపల్లిలో మంచి ఆధిక్యం దక్కించుకున్న అరికెపూడి గాంధీకి ఇది మూడో విజయం. 2014లో తెదేపా, 2018లో భారాస నుంచి గెలిచారు.


కుత్బుల్లాపూర్‌లో తాజాగా భారీ మెజార్టీతో సత్తా చాటిన వివేకానంద్‌, 2014లో తెదేపా నుంచి ,  2018లో భారాస నుంచి గెలిచారు.


సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌ తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు గెల్చారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.


కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు 2014లో తెదేపా, 2018లో, ఇప్పుడు భారాస నుంచి విజయభేరి మోగించారు.


పటాన్‌చెరు నుంచి భారాస అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా విజేతయ్యారు.


చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య 2014లో కాంగ్రెస్‌ నుంచి, భారాస అభ్యర్థిగా 2018, 2023లో గెలుపొందారు.


కార్వాన్‌ నుంచి కౌసర్‌ మొహియుద్దీన్‌ ఎంఐఎం అభ్యర్థిగా మూడోసారి గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని