logo

ఆశ్రయమిచ్చిన ఇంటి¸నే దోచిన బాలిక

ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఆర్‌.గిరిధర్‌ వివరాలు వెల్లడించారు.

Updated : 17 Apr 2024 05:16 IST

సి‡కింద్రాబాద్‌: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఆర్‌.గిరిధర్‌ వివరాలు వెల్లడించారు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు చిలకలగూడలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మరదలి కూతురు (13) వీరి వద్దే ఉంటూ 8వ తరగతి చదువుతోంది. వైఎస్‌ఆర్‌ జిల్లా పెంట్లమర్రి మండలం వేలూరుపాడుకు చెందిన చెప్పలి విజయ్‌కుమార్‌రెడ్డి (19) బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. బాలికతో ఇన్‌స్టాలో అర్జున్‌రెడ్డి పేరుతో పరిచయమై ప్రేమిస్తున్నానంటూ నమ్మించి అవసరాలకు డబ్బు తీసుకునేవాడు. బాలిక విడతల వారీగా రూ.1.50 లక్షల నగదు, 16 తులాల ఆభరణాలు తనకు ఆశ్రయం ఇచ్చిన ఇంట్లో కాజేసి అతడికి ఇచ్చింది. బాలికపై విజయ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

బయటపడిందిలా..: జనవరిలో శ్రీనివాస్‌రావు జేబులోని రూ.3 వేలు కనిపించకపోవడంతో బాలికను ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పింది. ఇంట్లో పరిశీలించగా కొన్ని నగలు కనిపించ లేదు. అనుమానంతో బాలిక ఫోన్‌ పరిశీలించారు. విజయ్‌కుమార్‌తో ప్రేమలో ఉన్నట్లు తేలింది. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపినట్లు.. నగలు తన క్లాస్‌మేట్‌ తల్లి సాయంతో కుదవపెట్టి డబ్బులు పంపించినట్లు తేలడంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని