logo

వరకట్నం కేసులో ఏడుగురికి రెండేళ్లు జైలు

అదనపు కట్నం కోసం వేధించిన కేసుకులో భర్తతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులకు రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.చందన మంగళవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ఎం.లక్ష్మయ్య తెలిపారు.

Published : 01 Feb 2023 05:17 IST

రామన్నపేట, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం వేధించిన కేసుకులో భర్తతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులకు రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.చందన మంగళవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ఎం.లక్ష్మయ్య తెలిపారు. రామన్నపేటకు చెందిన శిరీషను దామరచర్లకు చెందిన అక్కెనపల్లి రవితో 2012, ఫిబ్రవరి 24న వివాహమైంది. వివాహం సమయంలో రూ.10లక్షలు నగదుతో పాటు 15తులాల బంగారాన్ని ఇచ్చారు. కాగా.. వివాహం జరిగిన ఆరు నెలల నుంచి అదనపు కట్నం కోసం భర్త రవితో పాటు అత్త అక్కెనపల్లి కోటేశ్వరి, మరిది కిరణ్‌, ఆడపడచు చిర్ర కళ్యాణి, ఆమె భర్త శ్రీకాంత్‌, భర్త మేనమామ జె.జానకీరామ్‌, మేనమామ భార్య లక్ష్మిలు తరచుగా శిరీషను వేధించారు. పెద్దల సమక్షంలో పలు విడతలుగా చర్చలు జరిపినా వేధింపులు ఆగలేదు. దీంతో 2015, ఆగస్టు 26న రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో శిరీష ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై రామన్నపేట అదనపు కోర్టులో విచారణ జరుపగా మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు నిర్ధారణ కావటంతో శిరీష భర్త రవితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు జైలు విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని