logo

కొణతాల ప్రచారంలో జబర్దస్త్‌ నటుల సందడి

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్‌, సినీ నటులు గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ పట్టణంలో ప్రచారం నిర్వహించారు.

Published : 18 Apr 2024 04:42 IST

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్‌, సినీ నటులు గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ముందుగా శ్రీరామ నవమి పురస్కరించుకొని సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గవరపాలెం, వేల్పులవీధి, చాకలిపేట, శాఖవీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. డైలాగులతో ఓటర్లను చైతన్యపరిచారు. మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. హారతులు ఇచ్చి దీవించారు. వీరితో ఫొటోలు దిగడానికి యువకులు ఆసక్తి చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని