logo

నేటి నుంచి నామపత్రాల స్వీకరణ

జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్‌సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు.

Published : 18 Apr 2024 05:10 IST

కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్‌సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి జేసీ మయూర్‌ అశోక్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తూర్పు నియోజకవర్గ నామపత్రాలు కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో స్వీకరించనున్నారు. విశాఖ దక్షిణం, భీమిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సంబంధించి.. మహారాణిపేట, భీమిలి, పెందుర్తి, గాజువాక తహసీల్దార్‌ కార్యాలయాల్లో దాఖలు చేయాలి. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో ఇవ్వాలి. ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.


నేడు గంటా నామినేషన్‌..

ప్పటికే ప్రధాన రాజకీయపక్షాల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం శుభ ఘడియలు చూసుకొని తమ నామపత్రాలు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గురువారం నామపత్రం దాఖలు చేయనున్నారు.  విశాఖ పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి శ్రీభరత్‌ 22న, 19న తెదేపా తూర్పు నియోజకవర్గం అభ్యర్థి వెలగపూడి  నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు