logo

సీఎం వస్తే ఇంతే మరి!

ఏ ప్రాంతంలోనైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన, సభలు అంటే ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు తప్పడం లేదు. సోమవారం హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నారాయణపురం వరకు జరిగిన ముఖ్యమంత్రి బస్సుయాత్రకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు.

Updated : 16 Apr 2024 06:14 IST

బస్సుల్లేక యాతన

వెలవెలబోతున్న పాలకొల్లు బస్టాండ్‌

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఏ ప్రాంతంలోనైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన, సభలు అంటే ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు తప్పడం లేదు. సోమవారం హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నారాయణపురం వరకు జరిగిన ముఖ్యమంత్రి బస్సుయాత్రకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 296 బస్సులు ఉండగా వాటిలో 100 వరకు యాత్ర కోసం కేటాయించారు. మిగిలిన బస్సులు ప్రయాణికుల రద్దీకి ఏ మాత్రం చాలక సామాన్యులు అవస్థలు పడ్డారు. ఎండ తీవ్రత, ఉక్కబోత వాతావరణంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. డిపోల వారీగా భీమవరం- 30, తణుకు- 30, నరసాపురం, తాడేపల్లిగూడెం డిపోల నుంచి 20 చొప్పున బస్సుల చొప్పున తరలించారు. బీ జగన్‌ బస్సు యాత్ర మంగళవారం భీమవరం చేరుకోనుంది. ఇక్కడ జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భీమవరం-ఉండి రోడ్డులో పలు చెట్ల కొమ్మలను తొలగించారు. జగన్‌ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ పచ్చని చెట్లపై గొడ్డలి వేటు తప్పడం లేదని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు.

ఏలూరు బస్టాండులో ప్రయాణికుల నిరీక్షణ

భీమవరంలో పడిగాపులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని