logo

సిద్ధం బస్సు యాత్ర.. రెండేళ్లు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మరమ్మతులు

రెండేళ్ల నుంచి కనీస మరమ్మతులు లేకపోవడంతో ఉండి మండలంలో కోలమూరు- ఆరేడు రహదారి అధ్వాన స్థితికి చేరింది. భారీ గుంతల కారణంగా కొన్నినెలల కిందట జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 16 Apr 2024 08:09 IST

ఉండి, న్యూస్‌టుడే: రెండేళ్ల నుంచి కనీస మరమ్మతులు లేకపోవడంతో ఉండి మండలంలో కోలమూరు- ఆరేడు రహదారి అధ్వాన స్థితికి చేరింది. భారీ గుంతల కారణంగా కొన్నినెలల కిందట జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు ఘటనల్లో పలువురు గాయాలపాలయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు వేడుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ఈ మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.80 లక్షల నిధులు మంజూరైనా పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర ఈ మార్గం మీదుగా వస్తుందనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమై సోమవారం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. అప్పటికప్పుడు కంకర దిగుమతి చేసి గుంతలు పూడ్చి తారుపూత వేశారు. హడావుడిగా చేస్తున్న ఈ పనులు ఎంతకాలం నిలుస్తాయంటూ స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని