logo

Crime News: తన ఫొటో పంపి పోలీసులకు సవాల్‌ విసిరిన దొంగ దొరికాడు

‘నా ఫొటో పంపుతున్నా.. చిరునామా కూడా ఇస్తున్నా. చేతనైతే పట్టుకోండి చూద్దా’మంటూ పోలీసులకు సవాల్‌ విసిరిన ఖరీదైన కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను నగర పోలీసులు పట్టుకున్నారు.

Published : 23 Apr 2022 08:26 IST

సత్యేంద్ర సింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: ‘నా ఫొటో పంపుతున్నా.. చిరునామా కూడా ఇస్తున్నా. చేతనైతే పట్టుకోండి చూద్దా’మంటూ పోలీసులకు సవాల్‌ విసిరిన ఖరీదైన కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను నగర పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను చోరీ చేసిన కేసులున్నాయి. ఇటీవల బెంగళూరు పోలీసులు ఇతడిని అరెస్టు చేయటంతో పాత కేసుల్లో విచారించేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. శుక్రవారం సాయంత్రం పోలీసు కస్టడీకు తీసుకొన్నారు. గతేడాది జనవరిలో బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో బస చేసిన కన్నడ సినీ నిర్మాత వి.మంజునాథ్‌ కారు చోరీకి గురైంది. దీనిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి షెకావత్‌ ముఠా చోరీ చేసినట్టు నిర్ధారించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని