Published : 05 Dec 2021 01:50 IST
11న జాతీయ లోక్ అదాలత్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు, దిగువస్థాయి కోర్టుల వరకు ఈ నెల 11న లోక్ అదాలత్ నిర్వహించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ నిర్ణయించింది. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి, జిల్లా సెషన్స్ జడ్జి ఎం.వి.రమేశ్ శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు.
Tags :