logo

పర్యాటకానికి టీఎస్‌ ఆర్టీసీ బస్సులు

కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా కన్పించడంలేదు. దూర, పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా ఇంకెన్నాళ్లిలా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది

Published : 27 Jan 2022 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా కన్పించడంలేదు. దూర, పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా ఇంకెన్నాళ్లిలా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా తీసుకెళ్లి.. అంతే సురక్షితంగా తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెబుతోంది. ఆధ్యాత్మికమైనా.. విహారమైనా.. పర్యాటక యాత్రలకైనా తీసుకెళ్తామంటోంది. ఎంతమందో ఉన్నారో చెబితే తదనుగుణంగా మినీ ఏసీ బస్సు నుంచి గరుడ, ఇంద్ర ఏసీ బస్సులను సమకూర్చుతామని చెబుతోంది.

18 మంది ఉంటే వజ్ర మినీ బస్సు.. 18 మంది బృందంగా ఏర్పడి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇంటికే వజ్ర మినీ బస్సును పంపనుంది. విహార యాత్రలో ఎక్కడా ఆటంకం ఏర్పడకుండా అనుభవజ్ఞులైన బస్సు డ్రైవర్లను సమకూర్చుతామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 18 మంది కంటే ఎక్కువ ఉంటే.. పెద్ద బస్సులను సమకూర్చుతామన్నారు. కిలోమీటర్లు లెక్కన రుసుం వసూలు చేసి.. అదనపు భారం పడకుండా చూస్తామని చెబుతున్నారు.

డిపోలు, వెబ్‌సైట్‌ ద్వారా.. కాళేశ్వరం, అనంతగిరి, కాకతీయ యాత్ర, యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు ఆంజనేయ స్వామితో పాటు.. సమ్మక్క సారలమ్మ జాతరకు మినీ బస్సులను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్‌ ఆర్‌ఎం వెంకన్న తెలిపారు. నగరానికి వంద కి.మీ. పరిధిలో ఉన్న భువనగిరి ఫోర్టు, 50 కి.మీ. పరిధిలోని వర్గల్‌ సరస్వతి మందిరం, వరంగల్‌ జైన్‌ మందిర్‌, నల్గొండలోని రాచకొండ ఫోర్టు, మెదక్‌ ఫోర్టు, నర్సాపూర్‌ అటవీ ప్రాంతం, సోమశిల ప్రాంతం, నాగార్జున సాగర్‌, మల్లెల తీర్థం, శ్రీశైలం ఇలా నగరానికి చేరువగా ఉన్న ప్రాంతాలతో పాటు, ఊటీ, కొడైకెనాల్‌, కూర్గ్‌ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు సిద్ధమన్నారు. దగ్గర్లోని డిపోలను గానీ, tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని