వ్యాక్సిన్‌పై సందేహాలకు వాట్సాప్ చాట్‌బాట్?
కరోనా వైరస్ చికిత్సకు అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్, కొవిషీల్ట్ టీకాలకు (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)డీసీజీఐ అనుమతిచ్చిన నేపథ్యంలో అందరి దృష్టీ వాటిపైనే పడింది. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా? అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం..
దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్, కొవిషీల్ట్ టీకాలకు (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)డీసీజీఐ అనుమతిచ్చిన నేపథ్యంలో అందరి దృష్టీ వాటిపైనే పడింది. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా? అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ అందజేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే కొవిన్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పింది. తాజాగా కరోనా వ్యాక్సిన్‌పై సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్రం సిద్ధమైంది.
సేవలు వినియోగించుకోవడం ఎలా?
కరోనా వ్యాక్సిన్‌పై సందేహాలు ఉంటే 9013151515 నెంబరుకు వాట్సాప్‌లో ‘‘ Say Vaccine’’ అని పంపించాలి. అప్పుడు చాట్‌బాట్ సేవలు యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. మీ దగ్గరలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండే ప్రదేశాలు, ఎన్ని డోసులు వేసుకోవాలి? ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి?తదితర ప్రశ్నలకు చాట్‌బాట్ ద్వారా సమాధానం రాబట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది కూడా అభివృద్ధి దశలో ఉందని సమాచారం. ఇప్పటికే అల్గారిధమ్ పూర్తయిందని, అయితే యూజర్ నుంచి ఎన్ని ప్రశ్నల వరకు తీసుకోవచ్చనే విషయంపై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ముందు నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు చాట్‌బాట్‌లో నిక్షిప్తం చేసిన ప్రశ్నలు, సమాధానాలను బట్టి.. వ్యాక్సిన్లు పూర్తి సురక్షితం అని నియంత్రణ సంస్థలు నిర్ధారించిన తర్వాతనే సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌పై ఈ వ్యాక్సిన్లను ప్రయోగిస్తారు. వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న కొవిన్ యాప్‌తో అనుసంధానించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Politics News
BJP: జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో మార్పులు..
-
Sports News
IPL 2023: ‘కేఎల్ రాహుల్, డికాక్ ఆరెంజ్ క్యాప్ పోటీదారులుగా ఉంటారు’