Joint Family: ఉమ్మడి కుటుంబాలు క్షీణిస్తుండటంపై రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన

దేశంలో ఉమ్మడి కుటుంబ సంప్రదాయం క్షీణిస్తుండటంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 08 Apr 2024 23:45 IST

ఉదయ్‌పుర్‌:  మారుతున్న కాలంలో ఉమ్మడి కుటుంబం అనే సంప్రదాయానికి దాదాపు తెరపడిందని, దీనిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ramnath Kovind) అన్నారు. నేటి కాలంలో కుటుంబంలో విచ్ఛిన్నత పెరుగుతోందని పేర్కొన్నారు. భౌతికపరమైన సౌఖ్యాలే లక్ష్యంగా యువత.. తమ ఇంట్లో వృద్ధాప్యంతో ఉన్న తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉపాధి, ఆర్థికపరమైన ప్రయోజనాల వేటలో బయటకు వెళ్లిపోతున్నారన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో తారా సంస్థాన్‌కు చెందిన ద్రౌపది దేవి ఆనంద్‌ ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘వృద్ధులు ఇంట్లో ఒంటరిగా ఉండడానికి మరో కారణం ఏమిటంటే.. ఇంతకుముందు మన దేశంలో ఉమ్మడి కుటుంబం అనే సంప్రదాయం ఉండేది. కానీ క్రమంగా మారుతున్న కాలంతో ఈ సంప్రదాయానికి దాదాపు తెరపడింది. దీనిపై మనం మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది. వృద్ధులు భారం కాదు.. వాళ్లొక ఆస్తి. అనుభవాల సంపద.. కేవలం ఆస్తి మాత్రమే కాదు.. వారొక భరోసా. కుటుంబంలో వారు ఎంతో ఉపయోగకరంగా ఉంటారు’’ అని కోవింద్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని