ఆ దేశంలో మహిళలే మహారాణులు

మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ ముందుకుసాగుతున్నారు. రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.

Published : 29 Jan 2021 22:40 IST

అధ్యక్ష, ప్రధాని హోదాల్లో మహిళలే ఉన్న ఏకైక దేశంగా ఎస్తోనియా

తాల్లిన్‌: మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఐరోపాలోని ఎస్తోనియా అధ్యక్షురాలు సహా ప్రధాని కూడా మహిళే కావడం గమనార్హం. జనవరి 26న కాజా కల్లాస్‌ ప్రధానమంత్రిగా భాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రపతి, ప్రధానిగా మహిళలే బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకైక దేశంగా ఎస్తోనియా అవతరించింది. దేశంలోని పలు ప్రధాన శాఖల్లోని మంత్రులూ మహిళలే. 15 మంది సభ్యులతో కూడిన కాజా కల్లాస్‌ కేబినెట్‌ను అధ్యక్షురాలు కెర్ట్సి కలిజులైన్‌ ఏర్పాటు చేయగా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీంతో సెంటర్‌-రైట్‌ రిఫార్మ్‌ పార్టీకి చెందిన కాజా కల్లాస్‌ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా నియమితులయ్యారు.

2016లో కలిజులైద్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి ఆ స్థానాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా అవతరించారు. రానున్న సెప్టెంబర్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి పోటీ చేయనున్నట్లు కలిజులైద్‌ ఇప్పటివరకు ప్రకటించలేదు. కాగా కాజా కల్లాస్‌ ఇంకో రెండేళ్ల వరకు ప్రధానిగా కొనసాగనున్నారు. 2023 మార్చిలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కల్లాస్‌ తన కేటినెట్లో‌ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన శాఖలైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలతో పాటు పలు ఇతర శాఖల్లోనూ మహిళలను మంత్రులుగా నియమించారు. 1.3 బిలియన్ల జనాభా ఉన్న ఎస్తోనియా కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ అవరోధాన్ని ఎదుర్కోవడమే ప్రస్తుతం ఆ ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్‌.

ఇవీ చదవండి...

ద్వైపాక్షిక బంధానికి అష్టోత్తరం

ప్రపంచానికే గొప్ప ఆస్తి భారత్‌ : ఐరాస

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని