వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై మోదీ ఫొటో తొలగింపు..!

ఇటీవల ముగిసిన పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజుకో వివాదం రాజుకుంటూనే ఉంది.

Published : 05 Jun 2021 15:20 IST

కోల్‌కతా: ఇటీవల ముగిసిన పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజుకో వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా, మమతా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించడంతో మరో వివాదానికి తెరలేపినట్లయింది. ప్రస్తుతం పశ్చిమ్‌ బెంగాల్‌లో మూడోదశ వ్యాక్సినేషన్‌ ప్రకియలో భాగంగా 18-44 ఏళ్ల వారికి టీకాలు వేస్తున్నారు. వీరికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించి.. ఆ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటో ముద్రించారు. మరోవైపు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్‌లో కూడా ఇటీవల వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ ఫొటోను ముద్రించిన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని